Management of Temples : ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరో హామీ అమలు చేసింది.దేవాలయాల స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇకనుంచి దేవాలయాల్లో రాజకీయ,అధికారిక జోక్యం ఉండదు.ప్రతి ఆలయంలో వైదిక కమిటీ ఏర్పాటు కానుంది.ఆలయాల్లో జరిగే పూజలు, సేవలపై ఆ కమిటీ దే తుది నిర్ణయం.వైదిక,ఆగమ శాస్త్రాల ప్రకారమే ఆలయ నిర్వహణ జరగాలి.ఆ కమిటీల సిఫారసులను ఆ శాఖ కమిషనర్ తప్పకుండా అమలు చేయాలి.ఆలయ సంప్రదాయాలు,ఆగమ,వైదిక వ్యవహారాల్లో దేవాదాయ శాఖ అధికారులు, చివరకుఆలయ ఈవోలు సైతం జోక్యం చేసుకోవడానికి వీలుండదు.ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.ప్రతి ఆలయంలోనూ వైదిక కమిటీను నియమించాల్సి ఉంటుంది.
* రాజకీయ జోక్యం పెరగడంతో..
గత ఐదేళ్ల వైసిపి పాలనలోహిందూ దేవాలయాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ.ప్రతి ఆలయంలోనూ రాజకీయ జోక్యం పెరిగిందని విమర్శలు వచ్చాయి.ఈ తరుణంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అటువంటివి లేకుండా చేస్తామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఈ అంశాన్ని చేర్చారు. ఈ క్రమంలో అమలు చేసేందుకు నిర్ణయించారు. అన్ని ఆలయాల్లో వైదిక, ఆగమ సలహా కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
* కమిటీలకు కీలక అధికారాలు
ఈ కమిటీలకు కీలక అధికారాలు ఇచ్చారు. ఆలయాల్లో సేవలకు సంబంధించిన ఫీజుల నిర్ణయం, కల్యాణోత్సవాల ముహూర్తాలు, యాగాలు, కుంబాభిషేకాలు, కొత్త పూజల ప్రారంభించడంతోపాటు ఇతర ముఖ్యమైన అంశాల్లో వైదిక కమిటీ లేదా ఆలయ ప్రధాన అర్చకుల సూచనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 6 ఏ ఆలయాల్లో తక్షణం ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఆలయాల్లో రాజకీయ జోక్యాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.