https://oktelugu.com/

వైల్డ్ డాగ్ టీంకు గుడ్ బై చెప్పిన నాగ్..!

కింగ్ నాగార్జున కరోనా టైంలోనూ ఫుల్ బీజీగా గడుపుతున్నారు. బుల్లితెరపై ‘బిగ్ బాస్-4’కు హోస్టుగా చేస్తూనే మరోవైపు తన సినిమాలను కంప్లీట్ చేస్తూ సీనియర్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. నాగార్జున  తాజాగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవలే కులుమానాలి వెళ్లిన నాగ్ ఈ సినిమాలో తన షూటింగ్ పూర్తి చేశాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ నాగార్జున ఈ మూవీలో ఏసీపీ విజయ్‌వర్మగా కన్పించబోతున్నాడు. ‘వైల్డ్ డాగ్’ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 11:37 AM IST
    Follow us on

    కింగ్ నాగార్జున కరోనా టైంలోనూ ఫుల్ బీజీగా గడుపుతున్నారు. బుల్లితెరపై ‘బిగ్ బాస్-4’కు హోస్టుగా చేస్తూనే మరోవైపు తన సినిమాలను కంప్లీట్ చేస్తూ సీనియర్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. నాగార్జున  తాజాగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవలే కులుమానాలి వెళ్లిన నాగ్ ఈ సినిమాలో తన షూటింగ్ పూర్తి చేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    నాగార్జున ఈ మూవీలో ఏసీపీ విజయ్‌వర్మగా కన్పించబోతున్నాడు. ‘వైల్డ్ డాగ్’ మూవీ షూటింగు జరుగుతున్న క్రమంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్ లోనే నాగార్జున ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి హోస్టు చేస్తున్నాడు. తాజాగా సినిమా షూటింగులు ప్రారంభంకావడంతో బిగ్ బాస్ కు కొంత గ్యాప్ ఇచ్చి ‘వైల్డ్ డాగ్’ షూటింగులో పాల్గొన్నాడు.

    Also Read: నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సైలంట్ వెనుక కారణలెంటీ?

    బిగ్ బాస్ చేస్తూనే నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ పూర్తి చేయడం గమనార్హం. 21రోజులపాటు కులుమానాలిలో ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ అనుకోగా తొలుత నాగార్జున పార్ట్ ను దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ పూర్తి చేశాడు. దీంతో నాగార్జున తిరిగి హైదరాబాద్ కు చేరుకొని బిగ్ బాస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా వైల్డ్ డాగ్ టీంకు నాగార్జున గుడ్ బై చెబుతూ ట్వీట్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది.

    Also Read: కీర్తి బ్యాడ్ సెంటిమెంట్.. కలవరపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!

    ‘వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది.. ఇంటికి బయలుదేరాను.. నా టాలెంటెడ్‌ టీమ్‌కు.. హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది’ అంటూ షూటింగ్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను నాగ్ షేర్ చేశాడు. ఈ మూవీలో నాగార్జునకు జోడీగా దియామీర్జా నటిస్తోంది. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు