రేపు పీఎస్‌ఎల్వీసీ-49 ప్రయోగం: శ్రీవారిని దర్శించుకున్న శాస్త్రవేత్తలు

శ్రీహరికోటలోని షార్‌ నుంచి పీఎస్‌ఎల్వీసీ-49 ప్రయోగాన్ని శనివారం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రయోగ నమూనాను శ్రీవారి ఆలయంలో ఉంచారు. పీఎస్‌ఎల్వీసీ-49 ప్రయోగంలో దేశానికి చెందిన ఈవోఎస్‌-01తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనున్నారు. ఇందుకోసం రూ. 175 కోట్లు, ఉపగ్రహానికి రూ.125 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాదిలో కరోనా కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగం చేయలేదు. దీంతో ఇదే మొదటి ప్రయోగం కానుంది.

Written By: Velishala Suresh, Updated On : November 6, 2020 11:19 am
Follow us on