https://oktelugu.com/

పోలీసుల అదుపులో చీరాల..!

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం పోలీసుల అదుపులో ఉంది. ఇటీవల వైసీపీ నేత కృష్ణమోహన్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీలు నిర్వహించనున్నందున ముందుజాగ్రత్తగా పోలీసులు అలర్టయ్యారు. దేశాయిపేట నుంచి చీరాల గడియార స్తంభం వరకు ఆమంచి, చీరాల గడియా స్తంభం సెంటర్‌ నుంచి ఈపూరుపాలెం వరకు కరణం వెంకటేశ్‌ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు […]

Written By: , Updated On : November 6, 2020 / 11:59 AM IST
Follow us on

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం పోలీసుల అదుపులో ఉంది. ఇటీవల వైసీపీ నేత కృష్ణమోహన్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీలు నిర్వహించనున్నందున ముందుజాగ్రత్తగా పోలీసులు అలర్టయ్యారు. దేశాయిపేట నుంచి చీరాల గడియార స్తంభం వరకు ఆమంచి, చీరాల గడియా స్తంభం సెంటర్‌ నుంచి ఈపూరుపాలెం వరకు కరణం వెంకటేశ్‌ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.