Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హాట్ బ్యూటీ.. ప్రేక్షకులకు అందాల విందే!

Bigg Boss 8 Telugu : ఇక ఇంస్టాగ్రామ్ లో అమ్మడు చేసే స్కిన్ షో తరచుగా హాట్ టాపిక్ అవుతుంది. గ్లామరస్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

Written By: NARESH, Updated On : June 29, 2024 12:04 pm

Bigg Boss 8 Telugu

Follow us on

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షో. ప్రసారం అవుతున్న అన్ని భాషల్లో బిగ్ బాస్ కి ఆదరణ దక్కింది. మొదట్లో తికమక పడ్డ ఆడియన్స్ తర్వాత కనెక్ట్ అయ్యారు. ఈ మధ్య పల్లె ప్రాంతాల ఆడియన్స్ కూడా బిగ్ బాస్ ని అమితంగా ఇష్టపడుతున్నారు. ఇక తెలుగులో 2017లో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యింది. అప్పటి నుండి సక్సెస్ఫుల్ గా ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. భారీ టీఆర్పీ రాబట్టింది.

గత సీజన్లో అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. ఓ కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటి నుండి శివాజీ టైటిల్ ఫేవరెట్ గా ఉన్నాడు. చివరి వారాల్లో సమీకరణాలు మారిపోయాయి. శివాజీ ఏకంగా మూడో స్థానానికి పడిపోయాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి నుండి పల్లవి ప్రశాంత్ కి గట్టి పోటీ ఎదురైంది. శివాజీ, అమర్ దీప్ లను వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సీజన్ 8కి సన్నాహాలు మొదలుపెట్టారు. ఆగష్టులోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే వెండితెర, బుల్లితెర నటులు, సోషల్ మీడియా స్టార్స్ హౌస్లో అడుగుపెట్టనున్నారట. కాగా రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు. రీతూ చౌదరి సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. జబర్దస్త్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది.

ఇక ఇంస్టాగ్రామ్ లో అమ్మడు చేసే స్కిన్ షో తరచుగా హాట్ టాపిక్ అవుతుంది. గ్లామరస్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. రీతూ చౌదరి శృతి మించిన స్కిన్ షో మీద విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి. అయినా ఆమె పట్టించుకోదు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ లో దావత్ పేరుతో ఓ టాక్ షో చేస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులు రీతూ చౌదరిని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో ఆడియన్స్ కి కన్నుల పండగ అనే మాట వినిపిస్తోంది. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా రీతూ చౌదరి హౌస్ కి రావడం అనివార్యమే అంటున్నారు.