‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ ‘నభా నటేష్’కి బంఫర్ ఆఫర్ తగిలిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ కారణంగా వరుసగా ఆఫర్లు అయితే దక్కించుకుంటుంది గాని, చెప్పుకోతగ్గ స్థాయిలో ఆఫర్లు అయితే ఆమె చేతికి రావడం లేదు. కానీ ఇన్నేళ్లకు ఈ యంగ్ బ్యూటీకి లైఫ్ టర్న్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న 30వ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారట. అందులో తారక్ కి మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే, ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ గా ‘నభా నటేష్’ పేరు పరిశీలింపబడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పలు సినిమాల్లో మంచి రోల్స్ లో నటించినా నభాకి స్టార్ డమ్ రాలేదు. మరి ఎన్టీఆర్ సినిమాతో అయినా అమ్మడికి దశ తిరుగుతుందేమో. ఎలాగూ భారీ ఎత్తున అంచనాలున్న ఈ క్రేజీ కాంబోలో ఒక హీరోయిన్ గా నభా నటేష్ గాని ఎంపిక అయితే, కచ్చితంగా నభా రేంజ్ మారడం ఖాయం. ఎంతైనా అందంతో పాటు అభినయం విషయంలో కూడా వావ్ అనిపించేలా ఉండే నభాకి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి
ఇక ఈ చిత్రాన్ని జూన్ నుండి షూట్ చేయనున్నారు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఈ సినిమాని భారీ స్థాయిలో షూట్ చేసే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. మరి ప్రస్తుతం నడుస్తోన్న కరోనా సెకెండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ను మార్చే అవకాశం ఉంది.
ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్నట్టు ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల పోస్ట్ చేసిన మెసేజ్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెబుతుంది.