
టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన టిట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏమీ లేవని ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పై ఎంత మంది అభిమానులు, పార్టీ నాయకులు తనకు ఫోన్ లు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు. ఇటీవల కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని కోరారు.