https://oktelugu.com/

Nabha Natesh : మహేష్ సినిమాలో ‘ఇస్మార్ట్‌ బ్యూటీ’

Nabha Natesh: అందంలో అభినయంలో ‘నభా నటేష్‌‘కి (Nabha Natesh) తిరుగులేదు. కానీ, ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో మాత్రం లేదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్ తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ నభా స్థాయి రోజురోజుకు పడుతూ వచ్చింది. చివరకు ఛాన్స్ లు కూడా లేక ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయింది. అయితే, అదృష్టం ఉంటే.. పూర్తిగా ఓడిపోయాక కూడా విజయాలు అందుకోవచ్చు. ‘నభా నటేష్‌’కి అలాంటి బంఫర్ ఆఫరే […]

Written By:
  • admin
  • , Updated On : August 31, 2021 4:59 pm
    Follow us on

    Nabha Natesh in Mahesh-Trivikram filmNabha Natesh: అందంలో అభినయంలో ‘నభా నటేష్‌‘కి (Nabha Natesh) తిరుగులేదు. కానీ, ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో మాత్రం లేదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్ తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ నభా స్థాయి రోజురోజుకు పడుతూ వచ్చింది. చివరకు ఛాన్స్ లు కూడా లేక ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయింది.

    అయితే, అదృష్టం ఉంటే.. పూర్తిగా ఓడిపోయాక కూడా విజయాలు అందుకోవచ్చు. ‘నభా నటేష్‌’కి అలాంటి బంఫర్ ఆఫరే తగిలింది. మహేష్ (Mahesh)- త్రివిక్రమ్ (Trivikram) సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు.ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశాడు త్రివిక్రమ్. అయితే, ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ప్రకారం ఇప్పుడు మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    సెకెండ్ హీరోయిన్ అయినప్పటికీ సినిమాలో కమర్షియల్ సీన్స్ అన్నీ నభా చుట్టూ తిరుగుతాయట. అంటే.. ‘నభా నటేష్‌’ మీదే రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయట. ఒకవేళ మహేష్ సరసన నభాకి ఓ మంచి సాంగ్ పడితే.. ఇక నభా రేంజ్ మారిపోయినట్టే. ఆ మాటకొస్తే ఇప్పటికే పలు సినిమాల్లో నభా మంచి రోల్స్ లో నటించింది.

    పైగా ఆమె ఖాతాలో మంచి హిట్స్ కూడా పడ్డాయి. కానీ అందరూ ఏవరేజ్ హీరోలే కావడంతో నభాకి అనుకున్నంత స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. కాకపోతే మహేష్ సినిమా కాబట్టి, అలాగే త్రివిక్రమ్ డైరెక్టర్ కాబట్టి… సినిమా మినిమమ్ గ్యారంటీ. మరి ఈ సినిమాతోనైనా నభా దశ తిరుగుతుందా. వావ్‌ అనిపించేలా ఉండే నభాకి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ పుష్కలంగా ఉన్నాయి.

    ఎలాగూ మహేష్ – త్రివిక్రమ్ ది క్రేజీ కాంబో… మరి వీరి కలయికలో రానున్న సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్ గా సక్సెస్ అయితే , ఆమెకు డిమాండ్ భారీ క్రియేట్ అవుతుంది. కాకపోతే వచ్చే ఆ డిమాండ్ నే కరెక్ట్ గా వాడుకోవాలి.