Homeఎంటర్టైన్మెంట్31.08.2021 : టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు !

31.08.2021 : టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు !

Telugu Movies Latest Updates నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే..Anupama-Parameswaran-in-Nikhil-Karthikeya-2 హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ తోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆల్ రెడీ ’18 పేజెస్’ అనే చిత్రంలో అనుపమ – నిఖిల్ కలిసి నటిస్తున్నారు. తాజాగా ‘కార్తికేయ 2’ చిత్రంలో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. నిఖిలే ఆమెకు ఛాన్స్ ఇప్పించాడని టాక్.
Chiranjeevi yennai arindhaal telugu remake
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). పైగా చిరు ‘ఆచార్య’ సినిమాని ఇటీవలే పూర్తి చేశారు. అలాగే మెహర్ రమేశ్, బాబీలతో సినిమాలు చేస్తున్నారు. అయితే, తాజాగా మరో సినిమాకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకి మారుతి దర్శకుడు అయ్యే ఛాన్స్ ఉంది.
Samantha Akkineni
అక్కినేని సమంత సూపర్ హీరో తరహా పాత్ర చేయాలని ఆశ అపడుతుంది. పైగా అలాంటి పాత్ర చేయడం తన డ్రీమ్ అంటుంది. “కష్టాలలో ఉన్నప్పుడు సహాయం కోసం అరిచే తరహా పాత్రలంటే సామ్ కి అసహ్యం అట. మరి భవిష్యత్తులో సూపర్ హీరో పాత్రలాంటిది సామ్ చేస్తోందేమో చూడాలి.
shyam singha roy release date
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా రిలీజ్ పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. ఈ సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాని ఓటీటీకి అమ్మాలని ఆశ పడుతున్నారు. అందుకు నాని మాత్రం అంగీకరించట్లేదు. ప్రస్తుతం అయితే నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది ఈ సినిమా. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.
Akhanda latest updates
నటసింహం బాలయ్య బాబుతో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తోన్న ‘అఖండ’ సినిమా బిజినెస్ స్టార్ట్ అయింది. జీ5 డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతుంది. దాదాపు 20 కోట్లు ఇవ్వడానికి ఆ సంస్థ ఆసక్తిగా ఉంది. ఇది బాలయ్య సినిమాల్లోనే రికార్డు. మరి ఈ చిత్రంతో బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version