https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అవినాష్ నాటకాలు ఆడుతున్నాడంటూ నబీల్, ప్రేరణ షాకింగ్ కామెంట్స్..ఈ మాటలు విని కన్నీళ్లు పెట్టిన అవినాష్!

అవినాష్ కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఆయన వేసిన ప్రతీ పంచ్ పేలింది. అందుకే బిగ్ బాస్ ఇతనితో ఎక్కువగా కామెడీ చేయిస్తూ ఉంటాడు. హౌస్ లో ఇతన్ని ప్రత్యేకంగా చూస్తాడు. ఇది కొంతమంది కంటెస్టెంట్స్ కి నచ్చడం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 08:51 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

     

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ డిజాస్టర్ కాకుండా, పర్వాలేదు యావరేజ్ రేంజ్ లో ఉంది అంటే అందుకు ప్రధాన కారణమైన ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఒకరు అవినాష్. వైల్డ్ కార్డు ఎంట్రీ గా ఆయన హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి, ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం తన నుండి ఏది ఆశించి తీసుకుందో, వాటిని ప్రతీ క్షణం ఆయన అందిస్తూనే ఉన్నాడు. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికీ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ, ఆడియన్స్ కూడా కేవలం అవినాష్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ షో ని చూసే రేంజ్ ప్రభావితం చేసాడు. అవినాష్ కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఆయన వేసిన ప్రతీ పంచ్ పేలింది. అందుకే బిగ్ బాస్ ఇతనితో ఎక్కువగా కామెడీ చేయిస్తూ ఉంటాడు. హౌస్ లో ఇతన్ని ప్రత్యేకంగా చూస్తాడు. ఇది కొంతమంది కంటెస్టెంట్స్ కి నచ్చడం లేదు.

    ముఖ్యంగా ప్రేరణ అయితే అవినాష్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అసూయ ఉందని నిన్న బిగ్ బాస్ అన్ సీన్ వీడియో కట్స్ లో చూస్తే అర్థమైంది. నబీల్ ప్రేరణతో మాట్లాడుతూ ‘లోపలకు వచ్చిన ప్రతీ గెస్ట్ మీరంతా విన్నర్స్ అని అంటారేంటి. కప్ కొట్టినోడే అసలైన విన్నర్’ అని అంటాడు. దానికి ప్రేరణ సమాధానం చెప్తూ ‘ఈ వారం మొత్తం ముఖ్యం కాబట్టే, అవినాష్ ప్రతీ సందర్భంలో ఫోకస్ అయ్యేలా కామెడీ చేస్తున్నాడు’ అని అంటుంది. అప్పుడు నబీల్ కూడా నిజమే కదా అని అంటాడు. ఇక్కడ నబీల్ కి ముందుగా అవినాష్ మీద ప్రేరణకి ఉన్న అభిప్రాయం లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రేరణ మాటలకు తల ఊపాడో, ఆయన కూడా అవినాష్ మీద అదే అభిప్రాయం తో ఉన్నట్టు చూసే ఆడియన్స్ కి అనిపించింది. నబీల్ కి ఇలాంటివే పెద్ద మైనస్ అయ్యింది ఈ సీజోన్లో.

    మొదటి 7 వారాలు ఆయన నిఖిల్ తో సమానమైన ఓట్లు దక్కించుకుంటూ టైటిల్ రేస్ లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఆయనలో వెనుక చేరి మాట్లాడే తత్త్వం ఉందని జనాలకు అర్థమైందో, అప్పటి నుండి ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఆయన స్థానంలోకి గౌతమ్ వచ్చాడు. ముఖ్యంగా ప్రేరణతో కలిసి ఆయన ఇతర కంటెస్టెంట్స్ మీద పెట్టిన ముచ్చట్లు మామూలివి కాదు. ఇది ప్రేరణ గేమ్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు కానీ, నబీల్ గేమ్ పై మాత్రం చాలా గట్టి ప్రభావం చూపించింది. చివరి వారం లో ఆయన ప్రేరణ తో పెట్టిన ఈ ముచ్చట్లు టీవీ టెలికాస్ట్ లో రాలేదు కాబట్టి అతని ఓటింగ్ పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ లైవ్ చూసే వాళ్లకు మాత్రం నబీల్ ఇంకా మారలేదు అనే అభిప్రాయంతో ఉండిపోతారు.