https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ప్రస్తుతం ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ప్రేరణనేనా..? విన్నర్ ని మించిన డబ్బులు!

14 మందితో ప్రారంభమైన ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్, ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా మరో 8 మంది, మొత్తం మీద 22 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ని నడిపారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 08:41 AM IST

    Prerna

    Follow us on

    Bigg Boss Telugu 8 : 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్, ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా మరో 8 మంది, మొత్తం మీద 22 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ని నడిపారు. మనకి వీళ్లందరిలో విష్ణు ప్రియా తప్ప పాపులర్ సెలబ్రిటీ ఫేస్ ఎవ్వరూ కనపడలేదు. అందుకే ఈ సీజన్ పై ఆశించిన రేంజ్ లో హైప్ రాలేదు. అంచనాలను కూడా అందుకోలేదు. సీజన్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు చివరి వారం లోకి అడుగుపెట్టాం. మొదట అడుగుపెట్టిన 14 మందికంటే, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అవినాష్, రోహిణి వంటి వారు బుల్లితెర పై ఎన్నో ఈవెంట్స్ చేస్తూ, సినిమాల్లో కూడా బిజీ గా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఎవరు అనేదానిపై సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది.

    5 మందిలో అవినాష్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి అతనికే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనుకోవచ్చు. కానీ అతనికంటే ప్రేరణ కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ప్రేరణ ఈ షోని చూసే యూత్ ఆడియన్స్ కి ఈ షోకి ముందు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ, ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించిందట. ఈ సీరియల్ పూర్తి అవ్వగానే ఆమెకు ఇతర చానెల్స్ లో ఆఫర్స్ కూడా బాగా వచ్చినట్టు తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ ఆఫర్ కోసం ఆమె తనకి వచినటువంటి ఆ ఆఫర్స్ అన్నిటిని పక్కన పెట్టిందట. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఈమెకి వారానికి 4 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

    ప్రేరణ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో పాటు, ఆమె మగవాళ్ళతో సమానంగా గేమ్స్ ఆడడం ని ‘కిరాక్ లేడీస్..కిలాడీ బాయ్స్’ అనే ప్రోగ్రాం లో బాగా గమనించింది బిగ్ బాస్ టీం. ఈమె కచ్చితంగా బిగ్ బాస్ కి సరిపోతుంది అని బలంగా నమ్మి ఆమెని ఈ షోలోకి తీసుకున్నారు. ప్రేరణ వాళ్ళ నమ్మకానికి మించే ఎక్కువ కంటెంట్ ఇచ్చింది. అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించి ఆడియన్స్ కి బాగా దగ్గరై టాప్ 5 కి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా నిల్చింది. 15 వారాలు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఏకంగా 60 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇది సాధారణమైన విషయం కాదు, గెలిచిన కంటెస్టెంట్ కి ప్రైజ్ మనీ కూడా ఈ రేంజ్ లో ఉండడమే, మొత్తానికి ఈ షో ద్వారా జాక్పాట్ కొట్టేసింది ప్రేరణ.