https://oktelugu.com/

బాబు ఆవేశానికి తమ్ముళ్లు బలి కావాల్సిందేనా?

రాజకీయ పార్టీలకు, విగ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంటుందని అందరికీ తెల్సిందే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన నేత విగ్రహాలను ఆవిష్కరించి ప్రచారం చేసుకోవడం అన్ని రాష్ట్రాల్లోనూ కామన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేమీ కొత్తకాదు. దివంగత ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను టీడీపీ, వైసీపీ పోటీపోటాగా అన్ని ప్రాంతాల్లో ఆవిష్కరిస్తూ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతుంటడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దివంగత ఎన్టీఆర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2020 / 06:52 PM IST
    Follow us on


    రాజకీయ పార్టీలకు, విగ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంటుందని అందరికీ తెల్సిందే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన నేత విగ్రహాలను ఆవిష్కరించి ప్రచారం చేసుకోవడం అన్ని రాష్ట్రాల్లోనూ కామన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేమీ కొత్తకాదు. దివంగత ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను టీడీపీ, వైసీపీ పోటీపోటాగా అన్ని ప్రాంతాల్లో ఆవిష్కరిస్తూ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతుంటడం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

    ఇక చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దివంగత ఎన్టీఆర్ విగ్రహాలను అనేకచోట్ల ప్రతిష్టించారు. తమ పార్టీ నేత విగ్రహాలు అన్నిచోట్ల ఉంటే అక్కడి ప్రాంతవాసులంతా తమనే గుర్తించుకుంటారనే కోణంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ వారివారి నేతల విగ్రహాలను ఆవిష్కరించేందుకు పోటీపడుతుంటాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు తానే అధికారంలో శాశ్వతంగా ఉండిపోవాలనే ఆలోచనతో వీలైన ప్రతీచోట ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే కిందటి ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.

    వైసీపీలో షాడో మినిష్టర్లు.. జగన్ కు కొత్త తలనొప్పి?

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఓదార్పుయాత్ర, పాదయాత్ర చేసిన సమయంలో చాలాచోట్ల దివంగత వైఎస్ఆర్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ విగ్రహాలను చాలాచోట్ల పెట్టనీయకుండా అడ్డుకున్నారు. కొన్నిచోట్ల అప్పటికే ప్రతిష్టించిన విగ్రహాలను తీయించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలో మాజీ ఎంపీ లడగపాటి రాజగోపాల్ తనకెంతో ఇష్టమైన పోలవరం డిజైన్ బ్యాగ్రౌండ్ తో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడంలో అప్పట్లో తీవ్ర దూమారం రేపింది. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్మించిన ఈ విగ్రహాన్ని ప్రభుత్వం కావాలనే తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు.

    ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో ఇప్పుడు వైసీపీ నేతల వంతు వచ్చింది. నెల్లూరు జిల్లా కావ‌లి కూడ‌లిలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని స్థానిక వైసీపీ నేతలు తొలగించారనే ప్రచారంతో టీడీపీ రంగంలోకి దిగింది. ఈ అంశాన్ని స్థానిక టీడీపీ నేతలు సీరియస్ తీసుకొని వైసీపీపై పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే వైసీపీ నాయకులకు వణుకుపుట్టేలా చేయాలని టీడీపీ శ్రేణులను పిలుపునిచ్చారు.

    ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!

    ఇదంతా బాగానే ఉన్నా బాబు పిలుపు మేరకు త‌మ్ముళ్లు దూకుడుగా వెళితే వారిని కాపాడేవారు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే చంద్రబాబు హయాంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు జైల్లో మగ్గుతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో నేతలు దూకుడుగా వెళ్లి అరెస్టయితే ఎవరు తమను బయటికి తీసుకొస్తారనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. మాజీ మంత్రులకే ఇప్పటివరకు బెయిల్ దొరకడం లేదని ఇక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతే వారి పరిస్థితి ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో చంద్రబాబు ఆవేశానికి నేతలు బలికావాల్సిందేనా? అంటూ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.