Sarkaru Vari Pata: ‘సర్కారు వారి పాట’ నుంచి ఇప్పట్లో ఎలాంటి అప్​డేట్స్ లేనట్లేనా?

Sarkaru Vari Pata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‏లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన టీమ్​..  దానికి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 20, 2021 9:37 am
Follow us on

Sarkaru Vari Pata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‏లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన టీమ్​..  దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడం కూడా అందరికీ తెలిసిందే.

కాగా, ప్రస్తుతం టాలీవుడ్​లో విడుదలకు సిద్ధంగా ఉన్న అన్ని సినిమాల నుంచి ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ వస్తున్నాయి. దీంతో, వారి వారి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ, మహేశ్​ సినిమా సర్కారు వారి పాట నుంచి అప్పుడెప్పుడో మహేశ్​ పుట్టిన రోజు నాడు ఓ ప్రోమోతో ఆకట్టుకున్నారు టీమ్​. మళ్లీ ఇప్పటి వరకు సరైన అప్​డేట్​ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు అప్​డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు.. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్​ ఓ క్లారిటీ ఇచ్చారు.  ఇప్పట్లో ఎలాంటి అప్​డేట్స్ లేవని.. దానికి ఇంకా చాలా టైమ్​ ఉందని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. సమయం వచ్చినప్పుడు రచ్చ మొదలవుతుందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఇప్పట్లో సర్కారు వారి పాట నుంచి ఎటువంటి అప్​డేట్​ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపించట్లేదు.

ఇటీవలే ఈ సినిమాను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రా బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైలీష్ లుక్‏లో కనిపిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించగా పలు కారణాల వల్ల ఏప్రిల్ కు మార్చారు.