CBI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నవంబర్ 23వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ మొదలుకానుండగా డిసెంబర్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి చివరితేదీగా ఉంది.
Also Read: ప్రముఖ సంస్థలో భారీ వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, పీహెచ్‌డీ, గ్రాడ్యుయేషన్ , ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభించనుంది.
https://centralbankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఏవైనా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: బీటెక్ అర్హతతో ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?