Best Paying Jobs: రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ (ఆర్‌జీఎన్‌ఐవైడీ) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. తమిళనాడుకు చెందిన ఈ సంస్థ మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుందని తెలుస్తోంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలలో ఫైనాన్స్ ఆఫీసర్ 1, సెక్షన్ ఆఫీసర్ 1, లైబ్రరీ అసిస్టెంట్ 1, లైబ్రరీ అటెండెంట్ కమ్ టైపిస్ట్ 1, జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి.
Also Read: సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!
అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్‌జీఎన్‌ఐవైడీ, శ్రీపెరుంబుదూర్, కంచిపురం, తమిళనాడు–602105 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు భర్తీ జరగనుంది. 2021 సంవత్సరం నవంబర్ 26వ తేదీ నాటికి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది.
https://www.rgniyd.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: పోస్టాఫీస్ లో రూ.500తో ఖాతా ఓపెన్ చేసే ఛాన్స్.. రాబడి, ప్రయోజనాలు ఇవే?