Mythri vs Dil Raju fight: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ల మధ్య కొంతవరకు విభేదాలు అయితే వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ విషయాలు చాలావరకు వెలుగులోకి వస్తుండటం విశేషం…ఇక రీసెంట్గా దిల్ రాజు వాళ్ళ తమ్ముడు అయిన శిరీష్ ఒక ఇంటర్వ్యూ లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్లను ఉద్దేశించి వాళ్ళు నక్కలాంటివారు అంటూ మాట్లాడటం ఇప్పుడు పెను సంచలనాన్ని రేకెత్తిస్తుంది… నిజానికి ఆయన అలాంటి మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే గత కొద్ది రోజుల నుంచి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి దిల్ రాజుకి మధ్య ఒక కోల్డ్ వారైతే నడుస్తుంది…ఒకప్పుడు రెండు బ్యానర్ల మధ్య సత్సంబంధాలైతే ఉండేవి.
Also Read: అర్థరాత్రి అక్కినేని నాగార్జున ఇంట్లోకి చొరబడిన దుండగులు..సంచలనం రేపుతున్న వీడియో!
అయితే వీళ్ళ మధ్య గల సంబంధాలు చెడిపోవడానికి గల కారణం ఏంటి అంటే 2023వ సంవత్సరం సంక్రాంతి కానుకగా మైత్రి మూవీ మేకర్స్ వారు చిరంజీవి (Chiranjeevi) హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య అలాగే బాలయ్య బాబు(Balayya Babu) హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి అనే రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ఇక అదే సమయంలో దిల్ రాజు తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ ని హీరోగా పెట్టి వారసుడు (Varasudu) అనే సినిమా చేశాడు. ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేశాడు. అయినప్పటికి దిల్ రాజు దగ్గర ఎక్కువ థియేటర్లు ఉండటం అలాగే తను డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం వల్ల ఆ సినిమాకి ఎక్కువ థియేటర్లను కేటాయించుకొని ఈ సినిమాలకి తక్కువ థియేటర్లు ఇచ్చారు.
అవి కూడా చాలా ఓల్డ్ థియేటర్స్ కావడం వల్ల అప్పటి నుంచి మైత్రి వాళ్ళు దిల్ రాజు వ్యవహరించిన తీరు మీద అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే మైత్రి వాళ్ళు సైతం డిస్ట్రిబ్యూటర్స్ గా మారి ఇతర సినిమాలను కొంటూ హైదరాబాద్లో చాలా వరకు మూత పడిపోయిన థియేటర్లను తెరిపించారు. వాటిని లీజు కి తీసుకొని సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ గా ఎదుగుతూ వస్తున్నారు.
Also Read: అల్లు అర్జున్ డేట్స్ కోసమే రామ్ చరణ్ పై దిల్ రాజు బ్రదర్స్ నోరు పారేసుకున్నారా..?
ఇక ఈ క్రమంలోనే దిల్ రాజుకి తీసుకోవాల్సిన చాలా సినిమాల డిస్ట్రిబ్యూషన్స్ ని మైత్రి వాళ్లు ఎక్కువ రేట్ ఇచ్చి దక్కించుకుంటున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం అయితే పెరుగుతూ వస్తుంది. ఇక అలాగే దిల్ రాజుకి డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే లాభాలు కూడా రావడం లేదు.
దాంతో మైత్రి ప్రొడ్యూసర్స్ మీద ఆయన చాలా రోజుల నుంచి కోపంగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎట్టకేలకు వాళ్ళ తమ్ముడు అయిన శిరీష్ మాట్లాడిన మాటలు చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందనే చెప్పాలి. మరి ఈ వైరం ఎక్కడిదాకా వెళ్తుంది. మైత్రి వాళ్ళు ఈ ఇష్యూ మీద ఎలా రెస్పాండ్ అవుతారు. శిరీష్ కి కౌంటర్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…