India Vs australia World Cup Final: వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ వరుసగా పది విజయాలను నమోదు చేసి మంచి ఫామ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఇండియాకి వరల్డ్ కప్ అనేది ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి కప్పు సాధించడమే లక్ష్యంగా ఇండియన్ టీమ్ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్యాటింగ్ లోను, ఫిల్టింగ్ లోను తమదైన సత్తా చాటుతూ వరుసగా పది విజయాలను అందుకొని ఇండియన్ టీమ్ ఒక అరుదైన రికార్డును సాధించింది.
ఇక ఇప్పటివరకు ఇండియన్ టీమ్ ఎప్పుడు కూడా వరుసగా ఇన్ని విజయాలను అందుకోలేదు. ఇక ఈ ఫైనల్లో కూడా గెలిచి మూడోసారి వరల్డ్ కప్ అందుకున్న టీమ్ గా నిలవడమే కాకుండా వరుసగా వరల్డ్ కప్ లో 11 విజయాలను సాధించిన మూడవ టీమ్ గా అవతరించాలని ఇండియన్ టీం భారీ కసరత్తులు అయితే చేస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే ఒక ప్లేయర్ పర్ఫామెన్స్ మాత్రం అంత బాగలేకపోవడం ఇండియన్ టీమ్ కి మైనస్ గా మారుతుంది…ఆ ప్లేయర్ ఎవరు అంటే సూర్య కుమార్ యాదవ్….ఆయన ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 89 పరుగులు మాత్రమే చేశాడు.అంటే ఒక మ్యాచ్ లో 15 పరుగుల అవరేజ్ ని మాత్రమే నమోదు చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఇలాంటి ప్లేయర్ టీం లో ఉండే కంటే ఆయన ప్లేస్ లో ఎక్స్ ట్రా బౌలర్ ని తీసుకుంటే బాగుంటుంది అని చాలా మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఆల్రెడీ సూర్య కుమార్ యాదవ్ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి రవిచంద్రన్ అశ్విన్ రెఢీ గా ఉన్నాడు. ఆయన సూర్యకుమార్ యాదవ్ లా బ్యాటింగ్ లో భారీ హిట్టింగ్ చేయనప్పటికీ తను కూడా ఒక ఆల్ రౌండర్ కాబట్టి మ్యాచ్ కి చివరలో అవసరమైతే కొన్ని పరుగులు కూడా చేయగలడు ఇక ఇలాంటి సమయంలో సూర్య ప్లేస్ లోకి అశ్విన్ ని తీసుకోవడం బెస్ట్ అని చాలా.మంది అంటున్నారు…
అయితే రోహిత్ శర్మ మాత్రం ఎవరిని తీసుకోవాలనే దాని మీదనే కొంతవరకు డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ మాత్రం సూర్య ప్లేస్ లో అశ్విన్ ని తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్లు స్పిన్నర్ల బౌలింగ్ అడగడానికి కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు.కాబట్టి రవిచంద్రన్ అశ్విన్ అయితే ఆస్ట్రేలియాకి సరిపోతాడు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు…