https://oktelugu.com/

Devara Movie : దేవర సక్సెస్ లో ఎన్టీయార్ పాత్ర ఎంత ఉందో ఆ వ్యక్తి పాత్ర అంత కంటే ఎక్కువగా ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వైవిధ్యమైన కథాంశాలతో సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Written By:
  • Gopi
  • , Updated On : September 29, 2024 / 10:34 AM IST

    Music Director Anirudh

    Follow us on

    Devara Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఎలాంటి పాత్రనైనా పోషించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తన నటన పరంగా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతూ వస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది అంటూ ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి సక్సెస్ గా మారబోతుంది. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి నటనని కనబరిచి సినిమాని సక్సెస్ ఫుల్ రీతిలో ముందుకు తీసుకెళ్లాడు. అలాగే కొరటాల శివ కూడా ఈ సినిమాకి చాలా మంచి కథను అందించి తన టేకింగ్ తో ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లడనే చెప్పాలి.

    ఇక వీళ్లు కాకుండా ఈ సినిమాకి మరొక వ్యక్తి భారీగా హెల్ప్ అయ్యాడనే విషయం ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది. ఇంతకీ ఆయన ఎవరు అంటే రోజు అనువదించిన మ్యూజిక్ కొంతవరకు ప్రేక్షకుల్లో వ్యక్తం చేసినప్పటికీ ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి.ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఎలివేషన్స్ బాగా రావడానికి అయిన ఇచ్చిన మ్యూజిక్ అయితే అద్భుతం అనే చెప్పాలి.

    ఇక ఇప్పటివరకు తెలుగు సినిమాలకి అంత మంచి మ్యూజిక్ ని ఇవ్వని అనిరుద్ దేవర లో మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంలో అనిరుద్ కూడా చాలా వరకు హెల్ప్ చేశాడనే చెప్పాలి. మరి మొత్తానికైతే అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే వరుసగా తెలుగు ప్రాజెక్టులను ఓకే చేస్తూ సినిమాలను చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో బిజిఎం తో ఎన్టీఆర్ కి ఒక మాస్ ఎలివేషన్ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరి కొంత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు…

    ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో వరుసగా తన ఏడోవ విజయాన్ని కూడా నమోదు చేసుకున్నాడు. వరుసగా ఏడు సక్సెస్ లను అందుకున్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని రాబడుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…