https://oktelugu.com/

Devara Movie : దేవర లో హీరోయిన్ పాత్ర ను రిజెక్ట్ చేసి మంచి పని చేసిన స్టార్ హీరోయిన్…

తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. తమ సినిమాలను సక్సెస్ చేసుకొని స్టార్ హీరోలుగా మారాలనే సంకల్పంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 29, 2024 / 10:39 AM IST

    Pooja Hegde

    Follow us on

    Devara Movie :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో చాలా మంది దానికి అనుగుణంగా ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులను మెప్పించడానికి వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దర్శకులు అయితే చాలా కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా స్క్రీన్ ప్లే లో గాని మేకింగ్ లో గాని చాలా కొత్త రకమైన టెక్నాలజీని వాడుతూ అద్భుతమైన సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులలో ఇలాంటి కొత్తదనం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా మీద డివైడ్ టాక్ అయితే వస్తుంది.

    ఇక అందులో హీరోయిన్ గా నటించిన జాన్వి కపూర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన దర్శకుడు ఈ సినిమాలో జాన్వి కపూర్ క్యారెక్టర్ అసలు ఏమీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఆమె సాంగ్స్ కి మాత్రమే పరిమితం అవ్వడం చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా జాన్వి కపూర్ చేసిన పాత్ర మీద అంత సంతృప్తినైతే చెందడం లేదు. మరి కొరటాల శివ జాన్వి కపూర్ విషయంలో ఇలా ఎందుకు చేశాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఇక ఇదిలా ఉంటే దానివి జాన్వి కపూర్ కంటే ముందే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమాకి నో చెప్పినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఎందుకు ఆమె ఈ సినిమాకి నో చెప్పింది అనే విషయాలు సరిగ్గా తెలియదు గానీ, ఆమె ఈ సినిమా చేయకపోవడమే మంచిదైంది అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఏమీ లేదు. మొత్తం హీరో ను బెస్ చేసుకొని నడిచే కథ కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.

    మరి అలాంటప్పుడు అన్ని కోట్లు పెట్టి తనను హీరోయిన్ గా తీసుకోవడం ఎందుకు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా జాన్వి కపూర్ కి చాలా వరకు మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాని చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆమె చేసిన క్యారెక్టర్ మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…