Murugadoss Sikander: ఒకప్పుడు సౌత్ ఇండియా లో టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా AR మురుగదాస్(AR Murugadoss) ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రమణ(తెలుగులో ఠాగూర్), గజినీ, హిందీ గజినీ, కత్తి, తుపాకీ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా ని ఆయన ఒక ఊపు ఊపేశాడు. ప్రతీ స్టార్ డైరెక్టర్ కి మురుగదాస్ తో ఒక్క సినిమా చెయ్యాలని అప్పట్లో ఆశపడేవారు. తెలుగు లో ఆయన మెగాస్టార్ చిరంజీవి తో స్టాలిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్పైడర్ చిత్రాలు చేసాడు. వీటిలో స్టాలిన్ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడగా, స్పైడర్ చిత్రం మాత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. వాస్తవానికి మురుగదాస్ పతనం ఈ చిత్రంతోనే మొదలైంది. ఈ సినిమా తర్వాత విజయ్ తో తీసిన ‘సర్కార్’, రజినీకాంత్ తో తీసిన ‘దర్బార్’ చిత్రాలు యావరేజ్ గా ఆడాయి.
Also Read: 5వ రోజు హిందీ లో కూడా భారీగా పడిపోయిన ‘వార్ 2’ వసూళ్లు..తెలుగులో అయితే క్లోజ్!
ఆ రెండు సినిమాలు యావరేజ్ రేంజ్ లో ఆడదానికి కారణం రజినీకాంత్(Superstar Rajinikanth), విజయ్ స్టార్ స్టేటస్ కారణంగానే అని ట్రేడ్ పండితులు సైతం చెప్పుకొచ్చారు, మురుగదాస్ డైరెక్టర్ గా ఈ రెండు సినిమాల విషయం లో విఫలం అయ్యాడు అనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ఆయన సల్మాన్ ఖాన్ తో తీసిన సికిందర్(Sikindar Movie) చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం సల్మాన్(Salman Khan) హిస్టరీ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ప్రస్తుతం ఆయన తమిళ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) తో ‘మదరాసి'(Madrasi Movie) అనే చిత్రం చేస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న మురుగదాస్ ‘సికిందర్’ ఫలితం పై ఎవ్వరూ ఊహించని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘సికిందర్ చాలా మంచి కథ అని నేను ఇప్పటికీ నమ్ముతాను. ప్రస్తుత కాలం లో రిలేషన్స్ కి జనాలు అంతగా విలువ ఇవ్వడం లేదు. కానీ మన స్నేహితుల్లో ఒకడు మిస్ అయితే, ఎటు పోయాడు?, అసలు వాడు ఎక్కడున్నాడు?, ఏమి జరిగింది? అని ఆలోచించడం మొదలు పెడుతాం. అదే విధంగా ఎంతగానో ప్రేమించిన భార్య చనిపోతే చాలా విషయాలు మారిపోతాయి. మన గ్రామప్రజలంత కుటుంబం లాగా మనకి అండగా నిలబడుతారు. ఈ సినిమా గురించి నేను ఆలోచించిన విధానం వేరు, కానీ వెండితెర పై వచ్చిన ఔట్పుట్ వేరు. అది నేను అంగీకరిస్తున్నాను, కానీ సినిమా ఫెయిల్యూర్ కి పూర్తిగా నన్నే బాధ్యుడిని చేయడం మాత్రం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో ఆయన చేస్తున్న మదరాసి చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. కనీసం ఈ చిత్రం తో అయినా మురుగదాస్ కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.