https://oktelugu.com/

Murari re release : ‘మురారి’ రీ రిలీజ్ క్లోసింగ్ కలెక్షన్స్..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భారీ టార్గెట్ ఇచ్చిన మహేష్ ఫ్యాన్స్ !

ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు చాలా మంది హీరోల రీ రిలీజ్ చిత్రాలకి మొదటి రోజు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 14, 2024 / 08:33 PM IST

    Murari' re-release!

    Follow us on

    Murari re release : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అల్ టైం క్లాసిక్ గా నిలబడిన చిత్రాలలో ఒకటి ‘మురారి’. కుటుంబ కథ చిత్రాలు తియ్యడం లో సిద్ధహస్తుడైన కృష్ణ వంశీ ఈ చిత్రం తో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ని సృష్టించాడు. అలాంటి సినిమాని ఈ నెల 9 వ తారీఖున 4K క్వాలిటీ తో రీ మాస్టర్ చేయించి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెస్పాన్స్ మహేష్ ఫ్యాన్స్ సైతం ఊహించని రేంజ్ లో వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కేవలం మొదటి రోజే 5 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు ని సృష్టించింది. రెండవ రోజు కూడా ఈ చిత్రం అదే జోరుని చూపిస్తూ కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసి మహేష్ స్టామినా అంటే ఇది అని అందరికీ అర్థం అయ్యేలా చేసింది.

    ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు చాలా మంది హీరోల రీ రిలీజ్ చిత్రాలకి మొదటి రోజు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా రెండు రోజుల్లో 7 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మూడవ కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టి పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ ఫుల్ రన్ రికార్డుని కొట్టింది. ఒక క్లాస్ సినిమా రీ రిలీజ్ కి మూడు రోజుల్లో 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రావడం చిన్న విషయం కాదు. ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టడం లేదు. ముఖ్యంగా నైజాం మార్కెట్ లో మహేష్ బాబు క్రేజ్ బాగా డౌన్ అయ్యింది అని కామెంట్స్ చేసేవారు. కానీ ‘మురారి’ కి వచ్చిన వసూళ్లు చూస్తే మహేష్ బాబు క్రేజ్ చెక్కు చెదరలేదని, సరైన స్క్రిప్ట్స్ తగలేకపోవడం వల్ల అలా అందరికీ అనిపించిందని అభిమానులకు అర్థమైంది.

    ఇకపోతే నాల్గవ రోజు నుండి ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు అంతంత మాత్రమే. రేపు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కాబట్టి మురారి చిత్రాన్ని ఈరోజుతో అన్నీ థియేటర్స్ లో తీసేస్తున్నారు. నేడు ఆఖరి రోజు అవ్వడం తో మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి కి ఫేర్ వెల్ చెప్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో సెకండ్ షో హౌస్ ఫుల్ చేసారు. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో ఖుషి సినిమాకి చేశారు, ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ చేస్తున్నారు. మురారి సృష్టించిన ఈ ఆల్ టైం రికార్డ్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 న గబ్బర్ సింగ్ చిత్రంతో బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.