Kalki In OTT : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయం సాధించింది. తాజాగా కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె వంటి స్టార్ కాస్ట్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ చేసిన అద్భుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మహాభారతం నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచం సృష్టించాడు. ఈ వినూత్నమైన కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇక మధ్య మధ్యలో వచ్చిపోయే కేమియో పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కల్కి సక్సెస్ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఓటిటీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
ఆగస్టు 23 నుండి కల్కి ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. కాగా కల్కి 2898 ఏడీ మొత్తం రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి మూవీ స్ట్రీమింగ్ కానుంది.
దీనిపై అధికారిక ప్రకటన మేకర్స్ విడుదల చేయాల్సి ఉంది. కల్కి కథ విషయానికి వస్తే… యాస్కిన్(కమల్ హాసన్) భూమ్మీదున్న వనరులు అన్నింటినీ తీసుకుని ఆకాశంలో కాంప్లెక్స్ అనే నగరం సృష్టిస్తాడు. యాస్కిన్ శక్తి పొందేందుకు అవసరమైన సీరం కోసం ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. యూనిట్స్(డబ్బులు) ఇచ్చి కాంప్లెక్స్ కి వెళ్లి స్థిరపడాలి అనేది భైరవ(ప్రభాస్) కోరిక. అందుకు యాస్మిన్ కి కావలసిన సుమతి(దీపిక పదుకొనె)ను పట్టి తెచ్చిస్తానని మాటిస్తాడు. సుమతికి రక్షణగా అశ్వద్ధామ(అమితాబ్) ఉంటాడు. మరి భైరవ కల నెరవేరిందా? భైరవ-అశ్వద్ధామ మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది కథ.
కల్కి 2898 ఏడీ మూవీ వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. కల్కి ఎండింగ్ ట్విస్ట్ తో పార్ట్ 2 పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్ 1 కి అంతకు మించి కల్కి రెండవ భాగం ఉంటుంది అని మూవీ టీం చెబుతున్నారు.