https://oktelugu.com/

Mega Star Chiranjeevi: మెగాస్టార్ ” భోళా శంకర్ ” మూవీ ముహూర్తం టైమ్ ఫిక్స్…

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కోట్లలో అభిమానులను సంపాదించుకొని టాలీవుడ్ బాస్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మెగా స్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతూ… యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి 154 వ సినిమా పై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ పుట్టిన రోజు కానుకగా… ఈ సినిమాకు ” భోళా శంకర్ ” అనే  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 27, 2021 / 11:38 AM IST
    Follow us on

    Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కోట్లలో అభిమానులను సంపాదించుకొని టాలీవుడ్ బాస్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మెగా స్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతూ… యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి 154 వ సినిమా పై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ పుట్టిన రోజు కానుకగా… ఈ సినిమాకు ” భోళా శంకర్ ” అనే  టైటిల్ ని అనౌన్స్ చేశారు.

    అయితే తాజాగా  ఈ సినిమా నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా పూజ కార్యక్రమం ముహుర్తాన్ని వచ్చే నెల 11 వ తేదీన… ఉదయం 7.45 గంటలకు నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటిచింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది మూవీ యూనిట్. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. తమిళంలో మంచి హిట్ సాదించిన ” వేదాళం ” సినిమా కు రీమేక్‌ గా… ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ఏకే ఎంటర్‌ టైన్ మెంట్స్‌ పతాకం పై … అనిల్‌ సుంకర్ నిర్మిస్తున్నారు.

    https://twitter.com/MeherRamesh/status/1453203657441222661?s=20

    ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘ ఆచార్య ’ విడుదలకు సిద్ధమవుతుండగా… ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు డైరెక్టర్ బాబీతో చేయబోయే సినిమాకి ” వాల్తేరు వాసు ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.