Kosaraju Raghavaiah Chowdary: అది 1905 వ సంవత్సరం.. సెప్టెంబర్ 03 వ తారీఖు.. ఆ రోజుల్లో జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవారు. బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెం అనే గ్రామంలో ఒక సంఘటన జరిగింది. సోది చెప్పే ఒకామె వచ్చి.. ఈ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చే వ్యక్తి రాబోతున్నాడని చెప్పి వెళ్ళింది. కరెక్ట్ గా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు ఒక బాబు జన్మించాడు. సోది ఆమె చెప్పిన వ్యక్తి వీడేమో అని ఆ గ్రామ ప్రజలందరూ ఆ బాబు పై ప్రత్యేక ప్రేమను చూపించడం మొదలుపెట్టారు. ఆ బాబుకి ‘కొసరాజు రాఘవయ్య చౌదరి’ అని పేరు పెట్టుకున్నారు.

కొసరాజు రాఘవయ్య చౌదరి చదువు పూర్తి అయ్యాక మద్రాసు చేరుకున్నారు. మొదట కమ్మవారి చరిత్ర పై పరిశోధన చేసే ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కాలంలో కొసరాజుగా పేరు తెచ్చుకున్నారు. యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, భజనగీతాలు, జముకుల కథలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఇలా ఎన్నో రాశారు. ఈ క్రమంలోనే తెలుగు పాటల రచయితగా గొప్ప పేరు సాధించారు.
తెలుగు సినిమా పాటల రచయితగా ఆయనది ప్రత్యేక పీఠం. వ్యంగ్యం, హాస్యం మిళాయించి పాటలను రాయడంలో ఆయన మేటి. అందుకే, ఆ రోజుల్లో నిర్మాతలు పాట రాయాలి అంటే కొసరాజు రాఘవయ్య చౌదరిగారే రాయాలి అంటూ ఆయన ఇంటి చుట్టూ తిరిగేవాళ్లు. సినిమా జనాలకు అనుగుణంగానే కొసరాజు వందలాది గీతాల్ని తెలుగు కళామతల్లి పాదాలకు పారాణిలా అద్దారు.
జానపద గీతాలకు లాలిత్యాన్ని నేర్పింది కొసరాజునే. అలాగే సాంఘిక పాటలకు పొగరూ వగరూ అద్దింది కూడా కొసరాజు రాఘవయ్య చౌదరినే. ఆయన ఏ పాట రాసిన ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా కనిపించేది. పైగా కొసరాజు హ్యాసాన్ని బాగా నమ్మేవారు. అందుకే పనిగట్టుకుని హాస్యాన్ని తన పాటల్లో పెట్టేవారు. ఈ క్రమంలోనే ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకుని.. అప్పటి సామాజిక సమస్యల పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
అందుకే, కొసరాజు రాఘవయ్య చౌదరి అంటే.. అప్పటి ప్రజలకు ఒక గౌరవం ఉండేది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. కొసరాజు రాఘవయ్య చౌదరి హీరోగా కూడా నటించారు. పైగా ఆయన తొలితరం హీరో రైతుబిడ్డ అనే సినిమాలో రాఘవయ్య తొలుత కథానాయకునిగా నటించారు. 1939లో ఈ సినిమా వచ్చింది. అందుకే, అప్పట్లో తెలుగు సినిమాకు ప్రాముఖ్యత లేదు. బహుశా అందుకే, ఆయన హీరోగా నేటి ప్రేక్షకులకు తెలియదు.
కానీ, తన కర్లపాలెం మండలం చింతాయపాలెం అనే గ్రామానికి మాత్రం కొసరాజు రాఘవయ్య చౌదరి గొప్ప పేరును తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఆ గ్రామం గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1939 – 40 కాలంలో ఆ గ్రామానికి ప్రజలు వెళ్లి.. కొసరాజు కుటుంబాన్ని, కొసరాజును చూసి వచ్చేవాళ్ళు. అంటే ఒక విధంగా తెలుగు మొదటి సూపర్ స్టార్ కొసరాజునే అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన కవిగా మిగిలిపోయారు.
Also Read: వెంకీతో ఎన్టీఆర్ బావమరిది.. సెట్ అవుతుందా ?