Naga Chaitanya And Koratala Siva: ‘ఆచార్య’ చిత్రం ముందు వరకు కూడా టాలీవుడ్ లో నూటికి నూరు శాతం సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్ గా కొరటాల శివ(Koratala Siva) కి ఒక మంచి పేరు ఉండేది. కానీ ఆచార్య ఫ్లాప్ తో ఆయన సక్సెస్ స్ట్రీక్ కి పెద్ద బ్రేక్ పడింది. ఈ సినిమాకు కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా, వ్యాపార వ్యవహారాల్లో కూడా తలదూర్చడం కొరటాల శివ కొంప ముంచింది. ఈ ఫలితం నుండి తేరుకోవడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. అలా భారీ గ్యాప్ తీసుకొని, ఎన్టీఆర్ తో ‘దేవర’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసి,మరోసారి తన సత్తాని చాటుకున్నాడు కొరటాల శివ. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల కొరటాల శివ కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ సినిమా ఆడింది కేవలం ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కారణంగానే, కొరటాల శివ ఈ చిత్రాన్ని గొప్పగా తీర్చి దిద్దలేదు అంటూ సోషల్ మీడియా లో గట్టిగా కామెంట్స్ వినిపించాయి.
Also Read: 5వ రోజు హిందీ లో కూడా భారీగా పడిపోయిన ‘వార్ 2’ వసూళ్లు..తెలుగులో అయితే క్లోజ్!
అంతే కాకుండా ఈ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన కొరటాల శివ ని అభిమానులు అనేక సార్లు ఇది వర్కౌట్ అవ్వదు అని సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తూ వచ్చారు. కానీ కొరటాల మాత్రం పట్టువదలకుండా, ఎన్టీఆర్(Junior NTR) ని ఒప్పించి సెట్స్ మీదకు దాదాపుగా తీసుకొచ్చే ప్రయత్నమే చేశాడు. ఎన్టీఆర్ కూడా పలు సందర్భాల్లో ఈ చిత్రం కచ్చితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. కానీ రీసెంట్ గా ‘వార్ 2’ ఫలితాన్ని చూసి ‘దేవర 2’ ని ఆపేయడమే మంచిది అని ఎన్టీఆర్ చెప్పడం తో కొరటాల కూడా ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేసాడు. ఇక ఆ తర్వాత ఆయన అక్కినేని నాగచైతన్య కి కథ ని వినిపించాడట. రెండు మూడు సార్లు వీళ్ళ మధ్య కథ చర్చలు ముగిసిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఖరారు అయ్యిందని అంటున్నారు.
ఈసారి కొరటాల శివ కథ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ద పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ముట్టుకోని నిజ జీవితంలోని ఒక యాదార్థ ఘటనను ఆధారంగా చేసుకొని ఈ కథ ని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. నాగచైతన్య(Naga Chaitanya) గత చిత్రం ‘తండేల్’ కూడా నిజ జీవితం లో జరిగిన సంఘటన ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమానే. కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూశాము. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే తరహా పద్దతిని ఎంచుకున్నాడు. ఆయన మేకింగ్ స్టైల్ ఎంతో స్పెషల్ గా ఉంటుంది. అది నాగ చైతన్య కి బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాంటి సున్నితమైన అంశాలను అద్భుతంగా చూపించడం లో కొరటాల శివ దిట్ట, కాబట్టి ఈ ప్రాజెక్ట్ గట్టిగా వర్కౌట్ అయ్యేలాగానే కనిపిస్తుంది.