Bhairava Movie : ఈమధ్య కాలం లో సినీ వేదికలపై రాజకీయ సెటైర్స్ కొంతమంది హీరోలకు, దర్శక నిర్మాతలకు, క్యారక్టర్ ఆర్టిస్టులకు సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా వైసీపీ పార్టీ (YSRCP Party) అధికారం లోకి దిగిపోయిన తర్వాత ఆ పార్టీ ని ఉద్దేశించి సినీ వేడుకల్లో ఎన్నో సెటైర్ల వర్షాలు కురిపించారు. వారిలో ముఖ్యంగా మనం కమెడియన్ పృథ్వీ గురించి మాట్లాడుకోవాలి. ఈయన ‘గేమ్ చేంజర్’, ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో వైసీపీ పార్టీ ని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వైసీపీ పార్టీ అభిమానులు కూడా ఆయన చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం ఈయన చేసిన కామెంట్స్ కారణంగా ఆ రెండు సినిమాలను బ్యాన్ చెయ్యాలంటూ సోషల్ మీడియా లో డిమాండ్ చేశారు. అయితే ఆ రెండు సినిమాల కంటెంట్స్ బాగాలేకపోవడం తో ఆ రెండు చిత్రాలు ఫ్లాప్స్ గా నిలిచాయి.
Also Read : నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ పోస్ట్!
అయితే వైసీపీ పార్టీ అభిమానులు మాత్రం ఆ రెండు సినిమాలు మా వల్లే డిజాస్టర్స్ అయ్యాయి అంటూ ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ కారణంగా ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయా, లేదా అనేది పక్కన పెడితే సినీ వేదిక పై రాజకీయాల గురించి మాట్లాడడం ముమ్మాటికీ తప్పే. ఇది ఏ పార్టీ అభిమాని అయినా ఒప్పుకోవాల్సిందే. వైసీపీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా లో అలాంటి రియాక్షన్ ఇవ్వడం లో కూడా వాళ్ళ వైపు నుండి న్యాయం ఉంది. అయితే ఇదే తప్పుని భైరవం(Bhairavam Movie) మూవీ టీం కూడా చేసింది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఆ చిత్ర డైరెక్టర్ విజయ్ కనకమేడల పొలిటికల్ కామెంట్స్ భైరవం చిత్రానికి నెగటివ్ గా మారింది. ‘బాయ్ కాట్’ భైరవం అంటూ వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ఆరంభం లో ‘ధర్మాన్ని కాపాడేందుకు దేవుడు ఎదో ఒక రూపం లో వస్తుంటాడు’ అనే డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ని ఆయన గత సంవత్సర ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తూ కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ధర్మాన్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా ఏడాది క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరొచ్చారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ ధర్మాన్ని కాపాడేవాడు పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు అని డైరెక్టర్ ఉద్దేశ్యం. ప్రతీ డైరెక్టర్ కి ఇష్టమైన రాజకీయ నాయకులు ఉండొచ్చు. కానీ సినీ వేదిక పై అవతల నాయకులను కించపరిచేలా మాట్లాడడం తప్పు కదా, దీనికి వైసీపీ శ్రేణులు అంతలా కౌంటర్ ఇవ్వడం లో ఎలాంటి తప్పు లేదు. చూడాలి మరి ‘భైరవం’ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. మంచు మనోజ్, బెల్లకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన చిత్రమిది.