Rashi Khanna : టాలీవుడ్ లో అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రాశీ ఖన్నా(Rashi Khanna). కథ నచ్చి, క్యారక్టర్ తనకు ఎక్కితే ప్రాణం పణంగా పెట్టి నటించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. అందులో భాగంగానే నేడు ఆమెకు షూటింగ్ చేస్తున్న సమయం లో తీవ్ర గాయాలు అయ్యినట్టు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వాటిని చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. ఆమె మాట్లాడుతూ ‘నచ్చిన కథ తో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి గాయాలు అవుతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. చేతిపై, ముఖం పై తగిలిన గాయాలకు సంబంధించిన ఫోటోలను ఈ సందర్భంగా షేర్ చేసింది.
Also Read : మరోసారి మహేష్ బాబు ని టార్గెట్ చేసిన తేజ సజ్జ..మండిపడుతున్న ఫ్యాన్స్!
ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే రాశీ ఖన్నా, ఈమధ్య కాలం లో కాస్త స్పీడ్ తగ్గించింది. టాలీవుడ్ లో సినిమాలు చేయడం లేదు కానీ, హిందీ మరియు ఇతర భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె TME అనే యాక్షన్ డ్రామాలో నటిస్తుంది. అందులో ఒక ఫైట్ సన్నివేశం షూటింగ్ జరుగుతుండగా ఈ గాయాలైనట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఆమె ‘ఫర్జి 2’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో 2023 వ సంవత్సరం లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది. రాశీ ఖన్నా పాత్రకు కూడా ఇందులో మంచి గుర్తింపు లభించింది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే రాశీ ఖన్నా మన తెలుగు ఆడియన్స్ కి చివరిసారిగా కనిపించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతీ దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా 2022 వ సంవత్సరం లో విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు రాశీ ఖన్నా. చాలా కాలం తర్వాత ఆమె ఒప్పుకున్నా తెలుగు చిత్రం ‘తెలుసు కదా’. సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటిస్తున్న ఈ సినిమా తోనే ఆమె తెలుగు లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం రాశీ ఖన్నా కి మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఆమెకి సంబంధించిన లుక్స్ విడుదలయ్యాయి.
View this post on Instagram