Mrugaraju Movie: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నట్లుగానే, ఫ్లాప్స్, అట్టర్ ప్లాప్స్ మరియు డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఫ్లాప్స్ లో ఒకటి ‘మృగరాజు’. చిరంజీవి అభిమానులు ఈ సినిమా పేరు వింటేనే భయపడిపోతారు, అంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రమిది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ వసూళ్లు ఉంటాయి కాబట్టి, ఒక మూడు వారాల వరకు ఈ చిత్రం బాగానే ఆడింది. క్లోజింగ్ వసూళ్లు దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ వరకు వచ్చింది. కానీ ఆ తర్వాత సినిమా వసూళ్లు ముందుకు కదలలేదు. దీంతో పెట్టిన బడ్జెట్ రీకవర్ అవ్వక, ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ చిత్రం నిల్చింది. ఆరోజుల్లో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఎందుకంటే హాలీవుడ్ తరహా టేకింగ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అనే ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది.
అంతే కాకుండా ‘చూడాలని ఉంది’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో, అంచనాలు మరింత పెరిగాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ఈ చిత్రానికి దేవి వరప్రసాద్ నిర్మాతగా వ్యవహరించాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ అప్పటి మార్కెట్ పరిధి ని దాటి ఈ సినిమాకు భారీ బడ్జెట్ ని ఖర్చు చేసానని, మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడం తో చనిపోదామని అనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. గత దేవి వరప్రసాద్ చిరంజీవి తో ఘరానా మొగుడు, అల్లుడా మజాకా, కొండవీటి రాజా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. అలాంటి చిరంజీవి కి తన బ్యానర్ లో మర్చిపోలేని సినిమా ఇవ్వాలని చూసి చేతులు కాల్చుకున్నాడు.
అయితే ఈ సినిమా ఫలితం పై డైరెక్టర్ గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ‘ఈ సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం దేవి వరప్రసాద్ గారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2001 సమ్మర్ కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని షెడ్యూల్ చేసుకున్నాను. కానీ దేవి వరప్రసాద్ గారు అకస్మాత్తుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని తన నిర్ణయం మార్చుకున్నాడు. దాని వల్ల నేను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సరైన సమయం కేటాయించలేకపోయాను, ఫలితంగా సినిమా సరిగా షేప్ అవ్వలేదు. అంతే కాకుండా ఆయన నేను అవసరం లేదని చెప్తున్నా కూడా భారీ సెట్స్ వేసి ఒక సాంగ్ ని షూట్ చేశారు. ఆ సాంగ్ కారణంగా బడ్జెట్ ఇంకా వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. కంట్రోల్ చేయలేకపోయాను, దాని ఫలితమే మృగరాజు’ అంటూ చెప్పుకొచ్చాడు.