New Year Jio Recharge Offers: ఒకప్పుడు టెలికాం మార్కెట్లో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వంటివి టాప్ ప్లేయర్లుగా ఉండేవి. ఆ తర్వాత ఫస్ట్ మారిపోయింది. వోడాఫోన్, ఐడియా విలీనమయ్యాయి. వైడ్ రేంజ్ నెట్వర్క్ ద్వారా ఎయిర్టెల్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక మధ్యలోకి జియో వచ్చేసింది. దాదాపు ఎయిర్టెల్ స్థాయికి ఎదిగింది. అయితే మార్కెట్లో ఎక్కువ శాతం వాటాను దక్కించుకోవడానికి జియో అనేక రకాల ప్రణాళికలను రూపొందిస్తోంది.
ఎయిర్టెల్ కు దీటుగా సర్వీస్ అందించడానికి జియో ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తోంది. తాజాగా తన వినియోగదారులకు 2026 నూతన సంవత్సర కానుకగా అద్భుతమైన ప్రణాళికలను ప్రకటించింది. దీనికి హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని పేరు ఖరారు చేసింది.. జియో ప్రకటించిన ప్లాన్లు డేటాకు, కాల్స్ కు మాత్రమే పరిమితం కాలేదు. అత్యంత ఆధునిక సాంకేతికతను సామాన్యులకు దగ్గర చేసే విధంగా జియో ప్లాన్లు రూపొందించింది. గూగుల్ తో జియో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో.. ఎంపిక చేసిన రీఛార్జి ప్లాన్లతో జెమిని ప్రో ఏఐ సేవలను జియో ఉచితంగా అందించనుంది.
జియో యాన్యువల్ ప్లాన్ పేరుతో ఒక రీఛార్జ్ ను ప్రకటించింది. 3,599 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే.. ఏడాది పాటు ప్రతిరోజు 2.5 జిబి డేటా, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ 5జీ సేవలు యూజర్లకు సొంతమవుతాయి. అంతే కాదు 18 నెలల పాటు గూగుల్ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. యూజర్లు తమ పనులలో కృత్రిమ మేధ సహకారాన్ని ఉపయోగించుకుంటే మాత్రం ఇది పైసా వసూల్ ఆఫర్ అని చెప్పవచ్చు.
ఎంటర్టైన్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల పొందాలనుకుంటే.. అటువంటి వారికోసం 500 ధరతో సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్లో ప్రతిరోజు 2gb డాటా లభిస్తుంది. భారీ ఓటిటి బండిల్ కూడా లభిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లీవ్ వంటి 12 ఓటిటి యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అంతేకాదు, 18 నెలలపాటు జెమినీ ప్రో ఏఐ యాక్సెస్ లభిస్తుంది.
103 రూపాయలతో ఫ్లెక్సీ ప్యాక్ ను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 28 రోజులపాటు 5gb అదనపు డాటా అందిస్తుంది. యూజర్లు తమకు నచ్చిన లాంగ్వేజ్ లో ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా జియో వెబ్సైట్, మై జియో యాప్ లో అందుబాటులో ఉంటాయి. నెట్వర్క్ తో మాత్రమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా జియో అద్భుతమైన సేవను అందిస్తోంది. అందువల్లే న్యూ ఇయర్ 2026 పేరుతో ఈ ప్లాన్ లను ప్రకటించింది.