Harish Shankar : దెబ్బేసిన హరీష్ శంకర్..ప్రీమియర్ షోస్ నుండి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘మిస్టర్ బచ్చన్’

మిస్టర్ బచ్చన్ చిత్రం లో హరీష్ శంకర్ చేసిన తప్పు ఇదే. ఇక ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పే మరో మాట ఏమిటంటే హరీష్ శంకర్ హీరోయిన్ భాగ్య శ్రీ అందాలను చూపించడం లో పెట్టిన శ్రద్ద స్క్రిప్ట్ మీద పెట్టలేదు, ఆమె కోసమే ఈ సినిమా తీసినట్టు ఉంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Written By: Vicky, Updated On : August 15, 2024 8:35 am

Mr. Bachchan Premiere Show Talk

Follow us on

Harish Shankar : కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ కాస్త గ్యాప్ తర్వాత మాస్ మహారాజ రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి, నేడు సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్ నుండి వచ్చిన టాక్ చూస్తే హరీష్ శంకర్ రవితేజ కి పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు అనేది అర్థం అవుతుంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరో గా నటించిన ‘రైడ్’ అనే చిత్రానికి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. రైడ్ లాంటి చిత్రాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఏ మాత్రం చోటు ఉండదు. ఒకవేళ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తే కథలో ఉన్న బలం బలహీన పడుతుంది.

మిస్టర్ బచ్చన్ చిత్రం లో హరీష్ శంకర్ చేసిన తప్పు ఇదే. ఇక ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పే మరో మాట ఏమిటంటే హరీష్ శంకర్ హీరోయిన్ భాగ్య శ్రీ అందాలను చూపించడం లో పెట్టిన శ్రద్ద స్క్రిప్ట్ మీద పెట్టలేదు, ఆమె కోసమే ఈ సినిమా తీసినట్టు ఉంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్ తో కాస్త ఆడియన్స్ కి టైం పాస్ అయ్యేలా చేసినట్టు చెప్తున్నారు ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్. ఇకపోతే హరీష్ శంకర్ కొంత మంది టాప్ సెలబ్రిటీస్ ని ఉద్దేశిస్తే రాసిన సెటైర్స్ పర్వాలేదు అని అనిపించేలా ఉంటాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కూడా ఆయన చాలా పంచులు వేసాడట. ఎందుకంటే ఆయన వల్లే పవన్ కళ్యాణ్ తో చెయ్యాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ కసి కోపం మొత్తం ఒక సన్నివేశం లో చూపించాడట. హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి కానీ, కథ రసవత్తరంగా సాగుతుంది అనుకునేలోపు ఎదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ సినిమాకి స్పీడ్ బ్రేకర్ లాగ అడ్డొచ్చిందట.

ఈ సినిమాకి వచ్చిన ఈ టాక్ ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు మా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఎలా తీసాడో ఏంటో అని భయపడిపోతున్నారు. అయితే ఈమధ్య కాలంలో కమర్షియల్ సినిమాలకు ఆన్లైన్ లో రేటింగ్స్ బాగా రావడం లేదు అనేది వాస్తవం. కానీ బయట మాత్రం మౌత్ టాక్ తో మంచి వసూళ్లతో కమర్షియల్ హిట్స్ అవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ కూడా అలాంటి సినిమా అవ్వబోతుందా..?, ఎందుకంటే రవితేజ ధమాకా చిత్రానికి కూడా ఇదే స్థాయి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ కమర్షియల్ గా ఆ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా కూడా అలా అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి.