Bandi Saroj Kumar : చిరంజీవి అంటే నాకొక ఎమోషన్ అంటున్న కల్ట్ మూవీస్ డైరెక్టర్…

ఇండస్ట్రీ లో చాలా మంది అవకాశాలు లేక ఖాళీ గా తిరుగుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అవకాశాలను కల్పించుకుంటారు...అందులో బండి సరోజ్ కుమార్ ఒకరు...

Written By: Gopi, Updated On : August 15, 2024 9:35 am

Bandi Saroj Kumar

Follow us on

Bandi Saroj Kumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలే ఆయనను చాలా ఉన్నతంగా పరిచయం చేస్తూ ఉంటాయి. అలాగే సోలోగా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన హీరోగా కూడా చిరంజీవి చాలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయనను చూసి మనం కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించొచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో సామాన్య జనాలు కొందరు ముందుకు వచ్చారు. ఇక అందులో ఇక్కడ కష్టాలను తట్టుకొని నిలబడిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కల్ట్ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బండి సరోజ్ కుమార్ కూడా నేను చిరంజీవి అభిమానిని అంటూ గత కొన్ని రోజుల క్రితం ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.అయితే నేను చిరంజీవి అభిమానిని కానీ నేను ఆయన్ని చిరంజీవిని గారు అని పిలవను ఓన్లీ చిరంజీవి అని మాత్రమే పిలుస్తాను. ఎందుకంటే మనం ఇంట్లో అమ్మని అమ్మగారు అని పిలువము కాబట్టి చిరంజీవి ని కూడా నేను చిరంజీవి గారు అని పిలవను.

ఓన్లీ చిరంజీవి అని పిలుస్తాను అని మాట్లాడాడు. ఇక అప్పటినుంచి ఆయన మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ అయితే నడుస్తున్నాయి. నీకు పెద్దలను గౌరవించడం తెలియదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆయన పరాక్రమం సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసే ఫంక్షన్ ను ఏర్పాటు చేశాడు. ఇక దీనికి చీఫ్ గెస్ట్ గా హీరో సందీప్ కిషన్, ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ ఇద్దరు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా సరోజ్ కుమార్ మాట్లాడుతూ చిరంజీవి అని నేను మాట్లాడడం మీద వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి మాట్లాడుతాను అంటూ ఆ కాంట్రవర్సీ గురించి స్పందిస్తూ చిరంజీవి అనే వ్యక్తి నా నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాడు.

కాబట్టి నేను అతన్ని గారు అని సంభోదించను. ఎందుకంటే ఆయన నా చిరంజీవి…అందుకే నేను అలా పిలవలేను అంటూ కాంట్రవర్సీకి పులిస్టాప్ పెట్టాడు . ఇక ఇదిలా ఉంటే పరాక్రమం సినిమా ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక మొన్నటిదాకా యూట్యూబ్ లో బూతు డైలగులతో సినిమాలను చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఒక మంచి ఫ్యామిలీ చూడదగిన సినిమాను చేసినట్టుగా చెబుతున్నాడు.

అలాగే దీన్ని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇక చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ సినిమాతో బండి సరోజ్ కుమార్ థియేటర్లలో కూడా సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఒకవేళ ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ కనక సాధించినటైతే ఇప్పుడున్న హీరోలతో పాటు తను కూడా పోటీపడుతూ నటించే నటుడిగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…