Mr.Bachchan Trailer Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ కి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారంటీగా ఆడేది ఇక ఇప్పుడు మాత్రం ఆయన మేనియా కొంతవరకు పని చేయడం లేదు. అయినప్పటికి ఎప్పటికప్పుడు రవితేజ తనను తాను మౌల్డ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలను పెంచడానికి రీసెంట్ గా క్యూ అండ్ ఏ సేషన్ ను ఏర్పాటు చేశారు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది. ప్రేక్షకుడిని సినిమా థియేటర్ కి రప్పించగలిగే కెపాసిటీ ఈ ట్రైలర్లో ఉందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక ఈ ట్రైలర్ లో రవితేజ ఒక మాస్ ఎనర్జిటిక్ గా స్టార్ గా కనిపించాడు. డైలాగులు మాత్రం బుల్లెట్లలా పేలాయి. “సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేవాడు మాత్రమే సైనికుడు కాదు, దేశ సంపదను కాపాడే వాడు కూడా సైనికుడే” అనే డైలాగ్ అయితే అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఈ ఒక్క డైలాగ్ తోనే సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటో హరీష్ శంకర్ చెప్పకనే చెప్పాడు. ఇక ఈ సినిమాలో రవితేజ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. కాబట్టి ఇలాంటి డైలాగుని రాయడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే భాగ్య శ్రీ అందాలు, రవితేజ మాస్ ఎలిమెంట్స్, అలాగే జగపతిబాబు కృయాల్ మెంటాలిటీ మొత్తం కలిపి ఈ సినిమా ట్రైలర్ ని అవుట్ అఫ్ ది బాక్స్ గా నిలిపాయనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ తో ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు 15వ తేదీ కోసం ప్రేక్షకులందరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ‘రైడ్ ‘ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అయినప్పటికి హరీష్ శంకర్ అందులోని కోర్ పాయింట్ ను మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా సీన్లను మార్పులు, చేర్పులు చేసి తను కొత్తగా ట్రీట్మెంట్ కూడా రాసుకొని ఈ సినిమాని ప్రేక్షకులు ముందు ప్రజెంట్ చేస్తున్నాడు… బేసిగ్గా హరీష్ శంకర్ రీమేక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ ఆయన సినిమా మొత్తాన్ని అజీటిజ్ రీమేక్ అయితే చేయడు.
అందులో ఒక పాయింట్ మాత్రమే తీసుకొని తనకు నచ్చినట్టుగా సీన్లు రాసుకొని తన వే ఆఫ్ ట్రీట్మెంట్ వేసుకొని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి సక్సెస్ లను సాధిస్తాడు. ఇక ఈ సినిమాతో కూడా మరోసారి అదే సీన్ రిపీట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో భారీగా ఉండబోతున్నట్టుగా ట్రైలర్ లో చాలా స్పష్టంగా చూపించారు… అయితే అంత బాగానే ఉంది కానీ ట్రైలర్ లో కొన్ని రోటీన్ సీన్లను చూపించారు. వాటి వల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి…హరీష్ శంకర్ లవ్ సీన్స్ కొంచెం కొత్తగా రాసుకొని ఉంటే బాగుండేది…ఇక ఈ సినిమా ప్రేక్షకుడిని ఎంతవరకు మెప్పిస్తుంది అనేది తెలియాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే..