https://oktelugu.com/

Mr Bachchan Collections: హీరోయిన్ కి ఇచ్చిన డబ్బులు కూడా వచ్చేలా లేవు..’మిస్టర్ బచ్చన్’ మొదటి రోజు వసూళ్లు ఎంతంటే!

'మిరపకాయ్' లాంటి క్రేజీ బ్లాక్ బస్టర్ తర్వాత, రవితేజ - హరీష్ కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీ గానే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 'మిస్టర్ బచ్చన్' చిత్రం లోని పాటలు మంచి హిట్ అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 16, 2024 / 12:18 PM IST
    Mr Bachcha

    Mr Bachcha

    Follow us on

    Mr Bachchan Collections: టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ కి కాలం చెల్లిపోయినట్టే అని అనిపిస్తుంది. ఒకప్పుడు టాక్ తో సంబంధం లేకుండా కేవలం కాంబినేషన్ క్రేజ్ తో బంపర్ ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఎప్పుడు ఎంత క్రేజీ కాంబినేషన్ మూవీ కి అయినా మంచి టాక్ వస్తేనే కదులుతున్నారు ఆడియన్స్. నిన్న రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో విడుదలైన మిస్టర్ బచ్చన్ చిత్రం అందుకు ఉదాహరణ. ‘మిరపకాయ్’ లాంటి క్రేజీ బ్లాక్ బస్టర్ తర్వాత, రవితేజ – హరీష్ కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీ గానే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం లోని పాటలు మంచి హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్, ప్రొమోషన్స్ ఇలా అన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు అయ్యేలా చేసింది.

    ముఖ్యంగా ఈ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన భాగ్యశ్రీ భొర్సే అందచందాలకు కుర్రాళ్ళు మెంటలెక్కిపోయారు. ఇన్ని అంశాలు ఈ సినిమాకి కలిసొచ్చినా కూడా ఫ్లాప్ టాక్ రావడం తో కేవలం ప్రీమియర్ షోస్ వరకు మంచి వసూళ్లను రాగా, మొదటి రోజు వసూళ్లు మాత్రం ప్రతీ షో కి తగ్గుకుంటూ పోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రీమియర్స్ + మొదటి రోజు వసూళ్లు కలిపి దాదాపుగా 4 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది పర్వాలేదు అని అనిపించే ఓపెనింగ్ అనుకుంటే పెద్ద పొరపాటు. మొదటి రోజు 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న ఈ సినిమా కేవలం 6 కోట్ల రూపాయిల దగ్గరే ఆగిపోయింది. ఇక రెండవ రోజు వసూళ్లు నూన్ షోస్ చాలా దారుణంగా ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఈ వీకెండ్ తర్వాత ఈ చిత్రానికి ఒక్క రూపాయి షేర్ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్ కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతైనా ఈ చిత్రాన్ని రాబడుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

    వాస్తవానికి హీరోయిన్ భాగ్యశ్రీ కి కోటి రూపాయిల లోపే రెమ్యూనరేషన్ ఇచ్చారు. కానీ హరీష్ శంకర్ హీరోయిన్ ని, ఆమె అందాన్ని ఆ స్థాయిలో హైలైట్ చెయ్యడంతో నెటిజెన్స్ కనీసం ఆమెకి ఇచ్చిన డబ్బులు అయినా రికవర్ చేస్కోండి అని అంటున్నారు. ఈ సినిమాకి హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా డైరెక్టర్ అడిగినదానికంటే ఎక్కువే చేసారు. ఈ సినిమాకి ఫెయిల్యూర్ కి కారణం కేవలం హరీష్ శంకర్ టేకింగ్ వల్ల మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు . కనీసం హరీష్ శంకర్ తన తప్పులను తెలుసుకొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని అయినా బాగా తీస్తాడో లేదో చూడాలి.