Double iSmart: హీరో రామ్ ఊచకోత.. ఫ్లాప్ టాక్ తో బంపర్ ఓపెనింగ్స్..’డబుల్ ఇస్మార్ట్’ మొదటి రోజు ఎంత రాబట్టిందంటే!

పూరీ జగన్నాథ్ సహకరించలేదు. మంచి స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ దానిని చివరి వరకు నడిపించే స్క్రీన్ ప్లే ని సరిగా రాసుకోకపోవడం వల్ల ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ హీరో రామ్ కి ఉన్న మాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకి అన్నీ ప్రాంతాలలో బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి.

Written By: Vicky, Updated On : August 16, 2024 12:14 pm

Double iSmart first day box office collections

Follow us on

Double iSmart: యూత్ , మాస్ ,ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న మీడియం రేంజ్ హీరోలలో ఒకడు రామ్ పోతినేని. స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెట్టేందుకు అన్నీ విధాలుగా అర్హతులు ఉన్న ఆయన, సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడం వల్ల ఇప్పటికీ మీడియం రేంజ్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రామ్ ఫ్యాన్స్ లో ఎప్పటి నుండో ఉన్న నిరాశ. ఇక నిన్న ఆయన హీరోగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ రామ్ నటనని మాత్రం మెచ్చుకొని వారంటూ లేరు. ఆయన డైలాగ్ మోడ్యులేషన్స్ , ఎనర్జీ, డ్యాన్స్ అన్నీ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి.

కానీ పూరీ జగన్నాథ్ సహకరించలేదు. మంచి స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ దానిని చివరి వరకు నడిపించే స్క్రీన్ ప్లే ని సరిగా రాసుకోకపోవడం వల్ల ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ హీరో రామ్ కి ఉన్న మాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకి అన్నీ ప్రాంతాలలో బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాక్ వచ్చి ఉంటే మరోలా ఉండేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నా సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా కలుపుకొని 6 కోట్ల రూపాయలకు పైగా వచ్చి ఉంటుందని అంచనా. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ చిత్రానికి సీక్వెల్ అంటే ఇంకా ఎక్కువ ఓపెనింగ్ రావాలి, కానీ ఈ సినిమా విషయం లో అది జరగలేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి 18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, ఫుల్ రన్ లో 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 20 కోట్ల రూపాయిల లాభాలు అన్నమాట. డబుల్ ఇస్మార్ట్ శంకర్ కి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల రూపాయిలు జరిగింది.

కానీ ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించినది. కేవలం హీరో రామ్ మాస్ క్రేజ్ వల్ల మాత్రమే ఆ వసూళ్లు వచ్చాయని, లేకపోతే రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా కష్టంగా ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి వీకెండ్ లో ఈ సినిమా ఊపు అందుకుంటుందా లేదా అనేది. ఇకపోతే రామ్ తన తదుపరి చిత్రాన్ని హరీష్ శంకర్ తో చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రామ్ కోసం ఒక కథ రాసినట్టు తెలుస్తుంది.