Sankranti 2022 Telugu Movies: తెలుగు తెరకు సంక్రాంతి సీజన్ అంటే మహా పెద్ద పండుగ. అయితే, ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్ ఫోన్ కాక తప్పలేదు. అసలు సంక్రాంతి సీజన్ లోనే పెద్ద చిత్రాలన్నీ రిలీజ్ అవుతాయి. అయితే, కరోనా మూడో వేవ్ కారణంగా అన్నీ పెద్ద సినిమాలు పోస్ట్ ఫోన్ అవ్వడం.. చిన్న సినిమాలకు కలిసి వచ్చింది. ఒకటి రెండు కాదు, ఏకంగా లెక్కకు మించి చిన్న సినిమాలు ఇప్పుడు తెలుగు బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధం అయ్యాయి.

మరి ఈ సంక్రాంతికి ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో చూద్దాం.
బంగార్రాజు – జనవరి 14వ తేదీ విడుదల కానుంది.
సూపర్ మచ్చి – జనవరి 14 వ తేదీ విడుదల కానుంది.
రౌడీ బాయ్స్ – జనవరి 14 వ తేదీ విడుదల కానుంది.
హీరో – జనవరి 15 వ తేదీ విడుదల కానుంది.
Also Read: బాగా నచ్చాడు, అందుకే ముద్దు పెట్టి ప్రపోజ్ చేశా – శృతి హాసన్.
‘ది అమెరికన్ డ్రీమ్’ – జనవరి 14వ తేదీ ఆహా ఓటీటీ లో విడుదల కానుంది.
ఎటెర్నల్స్ (తెలుగు డబ్బింగ్) – జనవరి 14వ తేదీ డిస్ని+ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
మొత్తమ్మీద సంక్రాంతికి ఉన్నవాటిలో పెద్ద సినిమాగా బంగార్రాజు విడుదలకు రెడీ అయ్యాడు. అయితే ఆంధ్రాలో ఇప్పుడీ చిత్రానికి ఓ అడ్డంకి ఎదురైంది. 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. బాక్సాఫీస్ పరిస్థితి దారుణం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మరో పెద్ద సినిమాగా ‘రౌడీబాయ్స్’ రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
[…] Bangarraju: అక్కినేని నాగార్జున ఎంతో ముచ్చట పడి చేసిన సినిమా ‘బంగార్రాజు’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేస్తూ.. వాళ్ళ స్టైల్ లో ఒక రివ్యూ కూడా ఇచ్చారు. ఇంతకీ సెన్సార్ సభ్యులు చెప్పిన రివ్యూలో హైలెట్ పాయింట్స్ ఏమిటంటే.. […]