Sandeep Reddy Vanga And RGV: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ…ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే తనకు ఇష్టమైన దర్శకుడు మాత్రం రామ్ గోపాల్ వర్మ అంటూ తను చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆర్జీవీ కి సైతం సందీప్ రెడ్డి వంగ అంటే చాలా ఇష్టమని అతను కూడా చెబుతుంటాడు. ఇక రీసెంట్ గా జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న ‘జయమ్మూ నిశ్చయమ్మూరా ‘ అనే షో కిరామ్ గోపాల్ వర్మ – సందీప్ రెడ్డి వంగ ఇద్దరు కలిసి వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది… ఇక సందీప్ రెడ్డివంగ ఆర్జీవిలో తనకు నచ్చని విషయం ఏంటి అనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. వర్మ ఒకప్పుడు చేసినట్టుగా సినిమాలు చేయడం లేదని తను డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ తనకు నచ్చినట్టుగా ఉంటున్నాడని చెప్పాడు.
నిజానికి అభిమానులు తన నుంచి ఒక భారీ సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అది కనుక వర్మ గారు చేస్తే మాత్రం ఆయన టాప్ లెవల్ కి వెళ్ళిపోతాడు అంటూ సందీప్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా వర్మ సైతము సందీప్ మాటల మీద కౌంటర్లు అయితే వేశారట.
మరి ఆ కౌంటర్లు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ షో టెలికాస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే అని చెబుతున్నారు. మొత్తానికైతే ఈ షో ద్వారా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది చాలా బాగా ఎలివేట్ అయిందని, తద్వారా వాళ్ళ అభిమానులు సైతం చాలా ఆసక్తిగా ఈ షో కోసం ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇద్దరూ కూడా వాళ్ళ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకులే కావడం విశేషం…
అందువల్లే ఇద్దరికీ మిగతా దర్శకులతో పోలిస్తే చాలా ఎక్కువ క్రేజ్ అయితే ఉంటుంది… సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమాలు చాలా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్నప్పటికి ప్రేక్షకులందరిని మెప్పిస్తూ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. కారణమేదైనా కూడా ఆయన సినిమాల్లో చాలావరకు కంటెంట్ అయితే ఉంటుంది. మరి ఆ కంటెంట్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడని మరి కొంతమంది చెబుతుండడం విశేషం…