https://oktelugu.com/

మహేష్ తో సినిమా.. స్టార్ డైరెక్టర్ ఏమన్నారంటే?

దేశం గర్వించే ఎంతో గొప్ప కళాత్మక దర్శకుడు ‘మణిరత్నం’. 90వ దశకంలోనే హీరో, హీరోయిన్లతో లిప్ టు లిప్ ముద్దులు పెట్టించి ఇండస్ట్రీని షేక్ చేయించాడు. తమిళనాట అద్భుత విజయాలు అందుకున్నారు. ఆయన సినిమాలంటే ఒక క్లాసిక్. తెలుగులో నాగార్జునతో తీసిన ‘గీతాంజలి’ ఒక ఆణిముత్యం. అయితే ఎందుకో కమర్షియల్ విలువలు ఉండక ఈ యన సినిమాలన్నీ బాక్సీఫీస్ వద్ద ఢమాల్ అయ్యాయి. అప్పటి హిట్ లు ఇప్పుడు అందుకోలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా మణిరత్నం సినిమాలు ప్రస్తుత […]

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2021 / 11:56 AM IST
    Follow us on

    దేశం గర్వించే ఎంతో గొప్ప కళాత్మక దర్శకుడు ‘మణిరత్నం’. 90వ దశకంలోనే హీరో, హీరోయిన్లతో లిప్ టు లిప్ ముద్దులు పెట్టించి ఇండస్ట్రీని షేక్ చేయించాడు. తమిళనాట అద్భుత విజయాలు అందుకున్నారు. ఆయన సినిమాలంటే ఒక క్లాసిక్. తెలుగులో నాగార్జునతో తీసిన ‘గీతాంజలి’ ఒక ఆణిముత్యం. అయితే ఎందుకో కమర్షియల్ విలువలు ఉండక ఈ యన సినిమాలన్నీ బాక్సీఫీస్ వద్ద ఢమాల్ అయ్యాయి.

    అప్పటి హిట్ లు ఇప్పుడు అందుకోలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా మణిరత్నం సినిమాలు ప్రస్తుత తరానికి అర్థం కావడం లేదు. హిట్ కొట్టడం లేదు. తమిళ స్టార్ హీరోలతో తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అయ్యాయి. అందుకే ఇప్పుడు తెలుగు హీరోలు ఆయన అంటే ప్రాణం, ఇష్టం అని ఇంటర్వ్యూల్లో చెబుతున్నా.. మణిరత్నంతో సినిమాను మాత్రం చేయడం లేదు.

    అందుకే నాగార్జున ‘గీతాంజలి’ మూవీ తర్వాత మణిరత్నం మరో మూవీని ఏ తెలుగు హీరోతో చేయలేకపోయాడు. అప్పట్లో మహేష్ బాబుతో సినిమా దగ్గరిదాకా వచ్చి మరీ ఆగిపోయింది. ఆ వార్తలపై తాజాగా మణిరత్నం స్పందించాడు..

    మహేష్ బాబుతో సినిమా చేయాలనుకొని ఆయనను కలిసి కథ చెప్పి చర్చలు జరిపానని మణిరత్నం తెలిపాడు. కానీ కథ మహేష్ కు నచ్చలేదని వివరించాడు. భవిష్యత్ లో ఓ మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని మణిరత్నం అంటున్నాడు.

    ఇక ఇదే కథను నాగచైతన్య, రామ్ కు చెప్పినా కూడా వాళ్లు కూడా నో చెప్పారని టాక్. అందుకే ఇక కథలు, దర్శకత్వం వదిలేసి తాజాగా ఓ వెబ్ సిరీస్ కు నిర్మాతగా సెటిల్ అయిపోయాడు మణిరత్నం. నిర్మాతగా ఆయన తీసిన ‘నవరస’ టీజర్ ఈరోజు విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.