Ponniyan Selvan
Ponniyan Selvan: మణిరత్నం గొప్ప దర్శకుడు కావచ్చు. విక్రమ్ సహజంగా నటిస్తాడు కావచ్చు. 50 కి దగ్గరపడినా ఐశ్వర్యరాయ్ అందగత్తె కావచ్చు.. కానీ ఇవేవీ తెలుగు వాళ్లకు ఎక్కలేదు. అందుకే పొన్నియన్ సెల్వన్ సినిమాను పట్టించుకోలేదు. తెలుగు ప్రేక్షకులకు నచ్చాలి అంటే ఏదో కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ లేదు కాబట్టే పక్కన పెట్టారు. రాజమౌళి బాహుబలి లో అందులో ఒక ఎమోషన్ ఉంది. యశ్ కేజీఎఫ్ లో కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉంది.. అందుకే భాషా బేధంతో పని లేకుండా ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం. అదే పొన్నియన్ సెల్వన్ విషయానికి వస్తే తమిళ్ లో మాత్రమే ఇండస్ట్రీ హిట్ అయింది. మిగతా భాషల్లో డిజాస్టర్. కన్నడలో అయితే థియేటర్ ఖర్చులు కూడా రాలేదు. ఇప్పుడు ఇక ఈ సినిమా మొన్న జెమినీలో టెలికాస్ట్ అయింది. అది జెమినీలో ప్రసారమైనందుకో, లేక తెలుగు ప్రేక్షకులకు ఇష్టం లేకనో తెలియదు కానీ బార్క్ రేటింగ్స్ చాలా తక్కువ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే టీవీలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఆ యాడ్స్ భరిస్తూ, టీవీ ముందు కూర్చోవడం ప్రేక్షకులకు ఇష్టం ఉండటం లేదు. అందుకే సినిమాలకు జీఆర్పీలు పడిపోతున్నాయని ఒక వాదన ఉంది.
Mani Ratnam
ఇక ఒక సినిమాకు సంబంధించి టీవీలో టెలికాస్ట్ అయితే 10 grp లు గనుక వస్తే అది సూపర్ హిట్ కింద లెక్క. పొన్నియన్ సెల్వన్ సినిమాకు 2.11 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. బుల్లితెర పరిభాషలో చెప్పాలంటే అది దరిద్రమైన ఫ్లాప్ కింద లెక్క. మామూలు సీరియల్స్ కూడా ఐదు జి ఆర్ పి రేటింగ్ సాధిస్తుంటాయి. మణిరత్నం సినిమా, అందులోనూ భారీ తారాగణం ఉన్న సినిమా 2.11 రేటింగ్స్ సాధించడం నిజంగా ఆశ్చర్యకరమే. ఈ స్థాయిలో తెలుగు ప్రేక్షకుల తిరస్కరణ మణిరత్నం కూడా ఊహించి ఉండడు. ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు తమ ప్రైడ్ గా అభివర్ణించారు. ఇతర భాషల్లో తిరస్కరణకు గురైనప్పటికీ తమిళ ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా విడుదల కావలసి ఉంది. అని ఎందుకో విడుదల వాయిదా వేశారు. కొన్ని సీన్లు రీ షూట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగు ప్రేక్షకులు ఈ స్థాయిలో లైట్ తీసుకోవడం ఒకరకంగా మణిరత్నానికి పరాభవమే.. ఒక దిగ్దర్శకుడికి ఘోర అవమానమే.
Ulcer and BP: అల్సర్, బీపీని దూరం చేసే ఆహారం ఏంటో తెలుసా?
ఈ సినిమా జెమినీలో ప్రసారం కావడం, దానికి రీచ్ తక్కువగా ఉండటం ఓ కారణమని అంటున్నారు. జెమినీ టీవీ కంటే జెమిని మూవీస్ లో ప్రీమియర్ ప్రసారం చేసి ఉంటే కొంచెం మెరుగైన రేటింగ్ వచ్చేదేమో అని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమాను స్టార్ మా లో టెలికాస్ట్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు వినోద రంగంలో స్టార్ మా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. జీ తెలుగు రెండవ స్థానాన్ని ఆక్రమించింది. మా టీవీ ని దాని సీరియల్సే కాపాడుతున్నాయి. జీ తెలుగు కూడా ఈటీవీ ని కొట్టేసి మూడో ప్లేస్ కి వచ్చింది. ఇక జెమినీ ఐదో ప్లేస్ కి పడిపోయింది. దాని అనుబంధ ఛానల్ జెమినీ మూవీస్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.