Homeప్రత్యేకంDayaa Web Series Review : దయ వెబ్ సిరీస్ రివ్యూ (హాట్ స్టార్)

Dayaa Web Series Review : దయ వెబ్ సిరీస్ రివ్యూ (హాట్ స్టార్)

Dayaa Web Series Review : హీరో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన వెబ్ సిరీస్ దయ. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. హాట్ స్టార్ లో ఆగస్టు 4నుండి స్ట్రీమ్ అవుతుంది. ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. మరి దయ ప్రేక్షకులను మెప్పించిందా…

కథ:
దయ(జేడీ చక్రవర్తి) కాకినాడ పోర్టులో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య ఈషా రెబ్బా గర్భవతి. తన పని తాను చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్న డ్రైవర్ దయ జీవితం ఒక్క సంఘటనతో తలక్రిందులు అవుతుంది. చేపలు రవాణా చేసే ఫ్రీజర్ వ్యాన్ లో సడన్ ఒక లేడీ డెడ్ బాడీ కనిపిస్తుంది. తనకు తెలియకుండా తన వ్యాన్ లోకి వచ్చిన శవాన్ని చూసిన దయ షాక్ అవుతాడు. ఈ పరిణామం దయతో పాటు అతని ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. వరుస సంఘటనలతో పాతాళానికి పడిపోతూ ఉంటాడు. అసలు ఆ శవం ఎవరిది? దయ వ్యాన్ లో పెట్టింది ఎవరు? ఈ సమస్య నుండి దయ ఎలా బయటపడ్డాడు? ఇదే మిగతా కథ…

విశ్లేషణ:

దయ బెంగాలీ సిరీస్ తక్దీర్ రీమేక్. దర్శకుడు పవన్ సాధినేని తెలుగులో తెరకెక్కించారు. దయ ప్రతి ఎపిసోడ్ గ్రిప్పింగ్ సాగుతుంది. ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ కి అవసరమైన సాలిడ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు పవన్ సాధినేని మెప్పించాడు. పవన్ గతంలో తీసిన సేనాపతి క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్స్ ప్రెజెంట్ చేయడంలో పవన్ సాధినేని మాస్టర్ టెల్లర్ అని దయ సిరీస్ చూస్తే అర్థం అవుతుంది.

దయ వ్యాన్ లో లేడీ శవం కనిపించగా… హైదరాబాద్ లో కమల్ కామరాజు తన భార్య అయిన జర్నలిస్ట్ కవిత మిస్ అయినట్లు కంప్లైంట్ ఇస్తాడు. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందా అనేది ఆసక్తికర పరిణామం. కథనం ఆసక్తిరేపుతూ సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

సస్పెన్సు, డ్రామా, క్రైమ్ అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి. పొలిటీషియన్ స్వార్థానికి సామాన్యులు ఎలా బలి అవుతున్నారనే అంశాలను ప్రస్తావించారు. ఇక జేడీ చక్రవర్తి నటన అద్భుతం. చాలా సహజంగా సాగుతుంది. ఈషా రెబ్బా, పృథ్విరాజ్, జోష్ రవి, విష్ణుప్రియ, కమల్ కామరాజు, రమ్య నబీశన్ తన పాత్రల పరిధిలో మెప్పించారు.

ఫైనల్ గా దయ ఆద్యంతం ఆసక్తిగా సాగే తెలుగు వెబ్ సిరీస్. దర్శకుడు పవన్ సాధినేని టైట్ స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా నడిపాడు. అంచనాలకు అందని మలుపులు ఊపిరి బిగపట్టి చూసేలా ఉంటాయి. జేడీ చక్రవర్తి నటన మరో ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు బెస్ట్ ఛాయిస్.

Hotstar Specials Dayaa | Official Telugu Trailer | 4th Aug | JD Chakravarthy | DisneyPlus hotstar

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version