Thammudu Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నితిన్ లాంటి హీరో ఎన్ని సినిమాలు చేసిన కూడా అతనికి చాలా మంచి గుర్తింపైతే రాలేక పోతోంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆయన కెరియర్ చాలా వరకు డైలమాలో పడిపోయిందనే చెప్పాలి… ఇక ఈరోజు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అక్కకు ఇచ్చిన మాట కోసం ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న కొంతమందిని సేవ్ చేయడానికి నితిన్ ఆ ఏరియా కు వెళ్లి అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొని ఆ ప్రాంత ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు. మరి ఈ క్రమంలో ఆయన వాళ్ళ అక్క మాటను నిలబెట్టాడా? ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్లు పడుతున్న ఇబ్బందులు ఏంటి వాళ్లకు ఆయనకు మధ్య సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు (Venu Sriram) బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందించాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు కూడా లేడీస్ కి పెద్ద పీట వేస్తూ ఉండడం విశేషం. ఇక రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో కూడా ఆయన లేడీ ఎమోషన్స్ లేకుండా నేను కథలు రాయలేనని చెప్పాడు. ఇక ఈ కథ పేపర్ మీద బానే ఉంది. కానీ స్క్రీన్ మీదకు వచ్చేసరికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఎదురైనట్టుగా తెలుస్తున్నాయి. వేణు శ్రీరామ్ రాసుకున్న కథని చాలా క్లారిటీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యాడు. ఒక కథని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే అది ఎలివేట్ అవుతుంది.
కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. అందువల్లే సినిమాను చూస్తున్నంత సేపు ఏదో సాగుతుంది అంటే సాగుతుంది తప్ప ఎమోషనల్ గా ప్రేక్షకుడికి అసలు కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి. శ్రీరామ్ వేణు గత సినిమాల మాదిరిగానే ఎమోషన్స్ ను ఫుల్ లెంత్ కంటిన్యూ చేయలేకపోయాడు. మరి ఈ సినిమాలో కూడా అదే లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఫస్టాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్లు అయితే ఉన్నాయి. సినిమాలోకి ప్రేక్షకుడిని ఎంటర్ చేయడంలో ఆయన చాలా టైం అయితే తీసుకున్నాడు. మూవీ సెటప్ కోసం ప్రయత్నం చేసినప్పటికి ఆ సెటప్ కూడా అంత పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు… కొన్ని యాక్షన్స్ సన్నివేశాలు, సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడికి కొంతవరకు కనెక్ట్ అయినప్పటికి దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంటే దానికి ఒక స్టాండర్డ్ వాల్యూస్ అయితే ఉంటాయి. మరి ఈ సినిమాలో అవేమీ కనిపించవ్…. ఈ సినిమాలో ఏం నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశాడు అనే విషయం అయితే అర్థం కావడం లేదు…ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అంజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో నితిన్ యాక్టింగ్ చాలా బాగుంది. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకుడి కనెక్ట్ అవ్వకపోవడం తన క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ అయితే ఆయన చాలా చక్కగా ప్రజెంట్ చేసినా కూడా అది ప్రేక్షకుడికి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు… సప్తమి గౌడ సైతం మంచి పర్ఫామెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది తను కూడా కొంతవరకు సినిమాలో లీనమై నటించిందనే చెప్పాలి… ఇక వర్ష బొల్లామా తన పాత్ర మేరకు నటించి మెప్పించింది. లయ కి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికి చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది. ఆమెకు ఇది చాలా మంచి కంబ్యాక్ అనే చెప్పాలి… విలన్ గా చేసిన సురబ్ సత్యదేవ్ నటన కూడా చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే తన విలనిజం తో ప్రేక్షకులను భయపెట్టించాడనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అంజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది సినిమా ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయింది. సినిమా విజువల్స్ ఒకరకంగా బాగున్నప్పటికీ ఇంకాస్త ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఫస్టాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్, అనవసరమైన సీన్స్ లేపేస్తే బాగుండేది. సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండేది… ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సీక్వెన్సెస్
నితిన్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.25/5