రివ్యూ: ‘నారప్ప’-ఎమోషనల్ యాక్షన్ అదిరిందప్పా!

రేటింగ్ : 3 నటీనటులు : వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు రచన : వెట్రిమారన్ దర్శకత్వం : శ్రీకాంత్‌ అడ్డాల నిర్మాత‌లు : ఎస్. థాను, దగ్గుబాటి సురేష్‌బాబు సంగీతం: మణిశర్మ ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్ విక్టరీ వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ రోజు […]

Written By: admin, Updated On : July 20, 2021 7:04 pm
Follow us on

రేటింగ్ : 3

నటీనటులు : వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు

రచన : వెట్రిమారన్
దర్శకత్వం : శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాత‌లు : ఎస్. థాను, దగ్గుబాటి సురేష్‌బాబు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

విక్టరీ వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం, మరి ఆ అంచనాలకు ఫలితం దక్కిందా ? లేదా ? అనేది చూద్దాం.

కథాకమామీషుకి వస్తే.. నారప్ప (వెంకటేష్) తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తాగుతూ చేతకాని వాడిలా ఉంటాడు. కానీ తన పెద్ద కొడుకు మునికన్నా (కార్తీక్ రత్నం) ఆవేశపరుడు. తండ్రి చేతకానితనం అతనికి నచ్చదు. ఈ క్రమంలో తమ పొలంలోని హక్కుల కోసం ఆ ఊరి పెద్ద మనిషిని ఎదిరిస్తాడు. ఆ గొడవలు పెరిగి చివరకు ఆ ఊరి పెద్ద మనషి పై చేయి చేసుకుంటాడు. ఆ పగతో ఆ పెద్ద మనిషి తన మనుషులతో మునికన్నాని దారుణంగా చంపించడం, దాంతో నారప్ప చిన్న కొడుకు సినప్ప ఆ పెద్దమనిషిని నరికేయడం జరుగుతుంది. ఇక ఆ పెద్ద మనిషి మనుషుల నుండి నారప్ప తన చిన్న కొడుకుని, తన భార్య సుందరమ్మ (ప్రియమణి)ను ఎలా కాపాడుకున్నాడు ? ఈ క్రమంలో నారప్ప గతం గురించి సినప్పకి ఎలా తెలిసింది ? అసలు నారప్ప గతం ఏమిటి ? అనేది సినిమాలోనే మిగిలిన కథ.

విశ్లేషణ :
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకుంటే.. ఇదొక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. కులాల ఎక్కువ తక్కువల వల్ల, మరియు చిన్నపాటి ఆవేశాల వల్ల ఒక కుటుంబంలో ఎంత దారుణం జరుగుతుందో చూపించిన సినిమా ఇది. నారప్పగా వెంకటేష్ అద్భుతంగా నటించారు. మెయిన్ గా కొడుకు చనిపోయిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ లో, నారప్ప తన చిన్న కొడుకుని కాపాడే సీక్వెన్స్ లో, మరియు క్లైమాక్స్ లో వెంకటేష్ నటన చాల బాగుంది.

ఇక నారప్ప కొడుకుగా కార్తీక్ రత్నం, భార్యగా ప్రియమణి, అలాగే మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాజర్, రావురమేష్, రాజీవ్ కనకాల వంటి నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి నాయ్యం చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ బాగుంది. వెంకటేష్ నారప్ప పాత్రను ఎలివేట్ చేసిన విధానం, అలాగే నటీనటుల నుండి రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు.

అలాగే మణిశర్మ అందించిన నేపథ్యం సినిమాకే హైలెట్. ముఖ్యంగా ఇంటర్వెల్ లాంటి కొన్ని కీలక సీక్వెన్స్ లోని బ్యాగ్రౌండ్ స్కోర్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఈ చిత్రం నేపథ్యం, మాండలికం సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక మాస్ ఎలిమెంట్స్ తో సాగే ఎమోషన్స్ కూడా బాగా కుదరడం, బలమైన యాక్షన్ సీక్వెన్స్ కి అంతే బలమైన రీజన్స్ ఉండటంతో సినిమా మెప్పిస్తుంది.

అయితే, నరేషన్ స్లోగా ఉండటం నారప్ప సినిమాకి పెద్ద మైనస్. అలాగే రెగ్యులర్ సీన్స్, ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల రంగస్థలం, పలాస లాంటి సినిమాల పోలికలు గుర్తుకురావడం ఈ సినిమాకి వీక్ పాయింట్స్.

ప్లస్ పాయింట్స్ :

  • వెంకటేష్ నటన,
  • నేపథ్యం,
  • ఎమోషన్స్ తో సాగే పక్కా యాక్షన్ డ్రామా,
  • సంగీతం,
  • న్యాచురల్ విజువల్స్,
  • రియలిస్టిక్ డ్రామా

మైనస్ పాయింట్స్ :

  • ప్లాష్ బ్యాక్ లో వచ్చే డ్రామా,
  • ఇంట్రెస్టింగ్ సాగని స్టార్టింగ్ సీన్స్,
  • స్లో నేరేషన్,

సినిమా చూడాలా ? వద్దా ?

కచ్చితంగా చూడోచ్చు. కాకపోతే సినిమాలో చూపించిన సామాజిక అంశం ఈ డిజిటల్ ప్రపంచంలో బయట ఎక్కడా కనిపించక పోవచ్చు. కాబట్టి, ప్రేక్షక మహాశయులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ చెబుతుంది ఏమనగా సినిమాని సినిమాగా చూస్తేనే మీరు ఆ ఎమోషనల్ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారని మా మనవి.