https://oktelugu.com/

వీరికి రూ.6 వేల కోట్లు.. గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5 వేల కోట్ల రూపాయలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలిస్తుందని తెలిపారు. దీంతో రెండో విడత పంపిణీ కోసం మరో రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. మొదటి విడతతో పాటు రెండో విడతను […]

Written By: , Updated On : July 20, 2021 / 06:28 PM IST
Follow us on

KCRతెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5 వేల కోట్ల రూపాయలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలిస్తుందని తెలిపారు. దీంతో రెండో విడత పంపిణీ కోసం మరో రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం కోసం మొత్తంగా రూ.11 వేల కోట్లు కేటాయిస్తుందని చెప్పారు. ఇప్పుడు అందిస్తున్న యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలకు అనుసరించే కొనసాగుతుందని అన్నారు. కుల వృత్తులన్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బీసీ వర్గాల్లో జీవితాల్లో వెలుగులు నింపుతుందని వివరించారు.

తెలంగాణలోని కుల వృత్తులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ఎంతటి భారమైనా పోషిస్తుందని అన్నారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైనతెలంగాణ కుల వృత్తులకు జీవం పోస్తున్నామని తెలిపారు. వారి జీవితాల్లో వెలుగులు నింపే క్రమంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందని అన్నారు. అన్ని కులాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.