Japan Review: సినిమా అనేది ఒక వ్యసనం లాంటిది ప్రతి ఒక్క ఆడియన్ చూసే సినిమాని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాడు. సినిమా లవర్ శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు మందుబాబులకు ఎలాగైతే మందు కొడితే కిక్కు వస్తుందో సినిమా వాడికి ప్రతివారం ఒకటి, రెండు సినిమాలు చూస్తే గాని కిక్ రాదు. ఇక అందులో భాగంగానే ఈరోజు కార్తీ హీరోగా వచ్చిన జపాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంతవరకు అరించింది అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా జపాన్ సినిమా స్టోరీ లోకి వెళ్తే జపాన్ ( కార్తీ ) చిన్నప్పటి నుంచి చిన్న పొట్టకూటి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతాడు ఇలా దొంగగా మారిన జపాన్ తన కెరీర్ లో చాలా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఆయన కి ఒక బిగ్ డీల్ అనేది దొరుకుతుంది అది ఏంటి అంటే మినిస్టర్ ఇంట్లో డబ్బులు కొట్టేయాలి అనే ఒక డీల్ కుదురుతుంది.ఇక ఆ డీల్ ని అంగీకరించిన జపాన్ మంత్రి ఇంట్లో దొంగతనం చేస్తాడు సరిగ్గా అదే సమయానికి ఆ ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది ఈ మర్డర్ చేసింది జపాన్ అని అనుకున్న పోలీసులు జపాన్ కోసం వెతకడం మొదలు పెడతారు. అయితే ఈ దొంగతనం చేయడానికి ఆ మర్డర్ కి ఉన్న సంబంధం ఏంటి అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు కావాలనే ఆ మర్డర్ లో జపాన్ ని ఇరికించారా అనేది తెలియాలి అంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
ముందుగా కార్తీ గురించి చెప్పాలంటే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకొని స్టార్ హీరోలు సైతం ఎక్స్పరిమెంట్లు చేయొచ్చు అనే విధంగా ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్త పాయింట్ ని కనెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఖైదీ, సర్దార్ లాంటి అండరేటెడ్ మూవీస్ కూడా చేశాడు. కార్తీ తన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాలో కూడా వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుంటూ డిఫరెంట్ ప్లాట్ లో సినిమాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇక అందులో భాగంగానే జపాన్ మూవీ చేశాడు.ఇక సినిమా ఎలా ఉంది అనేది బ్రీఫ్ గా అనాలసిస్ లో తెలుసుకుందాం…
ముందుగా ఒక రాబరీ స్టోరీని తీసుకొని ఎమోషన్ ని జోడించి రొటీన్ ప్లాట్ లో కాకుండా ఒక కొత్త అటెంప్ట్ తో సస్పెన్స్, కామెడీ , ఎమోషన్ అన్ని తెలిపిన సినిమాగా జపాన్ సినిమాను చేశారు.ఇక ముఖ్యంగా జోకర్ సినిమా ఫేమ్ తెచ్చుకున్న రాజమురుగన్ ఈ సినిమాని అద్భుతంగా తీశారు అనే చెప్పాలి.ఇక ఆయన తీసిన కొన్ని రాబరీ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా కార్తీ నటించిన కొన్ని సీన్లు చూస్తే ఆయన తప్ప మరెవరూ ఆ క్యారెక్టర్ చేయలేరు అనేంత రేంజ్ లో ఎలివేట్ అయ్యాయి.
డైరెక్టర్ రాజ్ మురుగన్ కి కార్తీ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో సినిమా చేయాలనే ఆలోచన రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి… అయితే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే పరంగా రాజు మురుగన్ ఒక అద్భుతమైన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాశాడనే చెప్పాలి. ప్రతి ప్రేక్షకుడిని కూడా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ సీట్ ఎడ్జ్ లో కూర్చో పెట్టే స్క్రీన్ ప్లే రాయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా అధ్యంతం కామెడీగా సాగుతూనే సస్పెన్స్ ఎక్కడ కూడా రివిల్ అవ్వకుండా సినిమాని ఆధ్యాంతం ఎంగేజ్ చేసుకుంటూ వస్తూనే సినిమాకి ఒక అద్భుతమైన రూపాన్ని ఇచ్చాడు.ఇక జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ ఒకే అనిపించింది.సాంగ్స్ పరంగా పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా బిజిఎం మాత్రం కొన్ని సీన్లు ఎలివేట్ అవ్వడంలో చాలా ముఖ్య పాత్ర పోషించాయి.
ముఖ్యంగా రౌడీలకి, కార్తీకి మధ్యలో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ లో అయితే బిజీయం నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. అందుకే జీవి ప్రకాష్ ని చాలామంది డైరెక్టర్లు వాళ్ల సినిమా కి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు… ఆయన లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక సీన్ ని తను ఓన్ చేసుకొని తను ఎంతవరకైతే డెప్త్ గా మ్యూజిక్ ఇవ్వగలడో అంతవరకు వెళ్లి మ్యూజిక్ చేస్తూ ఉంటాడు బిజీ ఏం అయితే టాప్ నాచ్ లో ఇస్తాడు… ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది,అలాగే ఎడిటర్ ఫిలమిన్ రాజు చేసిన ఎడిటింగ్ కూడా ఇంప్రెస్సివ్ గానే ఉంది…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కార్తీ తనదైన రీతిలో సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నట్లుగానే ఈ సినిమాలో కూడా జపాన్ అనే క్యారెక్టర్ లో అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా ఆ క్యారెక్టర్ ఉన్న వేరియేషన్స్ కానీ, డైలాగ్ మాడ్యూలేషన్స్ లో గాని డిఫరెన్స్ ని చూపిస్తూ కుమ్మేసాడు అనే చెప్పాలి… ఇక అను ఇమాన్యుయేల్ తన పాత్ర మేరకు తను న్యాయం చేసింది. అలాగే సునీల్ ఇంకో కీలకమైన పాత్రలో నటించినప్పటికీ ఆయన కూడా తన నటనలో కొత్తరకమైన వైవిధ్యాన్ని చూపిస్తూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు పుష్ప సినిమాలో మంగళం శీనుగా ఎలాగైతే ఆకట్టుకున్నాడో ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేశాడు అది కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది… విజయ్ మిల్టన్ కూడా తన పాత్ర మేరకు ఓకే అనిపించాడు…
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
కార్తీ నటనలో ఉన్న వేరియేషన్స్ చాలా బాగున్నాయి ముఖ్యం గా ఆ కామెడీ వే డైలాగ్స్ ప్రేక్షకులకు ఫుల్ ఫ్యాన్ ఇస్తాయి…అలాగే స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ,కొన్ని సీన్స్ లో బిజీయం హైలెట్ గా సెట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకి బాగా ప్లస్ అయిన ఎలిమెంట్స్ ఇవే…
ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ వచ్చేసి కథ కొంతవరకు రొటీన్ గా సాగింది, అలాగే సాంగ్స్ కార్తీ గత సినిమాలతో పోల్చుకుంటే కొంతవరకు తగ్గాయి. జీవి ప్రకాష్ కూడా గత సినిమాలతో పోలిస్తే తన పూర్తి డెప్త్ తో మ్యూజిక్ ఇచ్చినట్టుగా అనిపించలేదు…కొన్ని సీన్స్ అక్కడక్కడ లాగ్ అయ్యాయి…ఇక వీటిని మినహా ఇస్తే సినిమా లో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏం లేవు
మొత్తానికి అయితే ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు…
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5