Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ మొదలైనప్పటి యావర్ తన తల్లిని గుర్తుచేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ తల్లిని చూసి యావర్ భోరున ఏడ్చాడు. ఆమె యావర్ ని దగ్గరకు తీసుకుని ‘ నువ్వు కూడా నా కొడుకువే’ ఏడవకు అంటూ ఓదార్చింది. ఇక రోజు శోభా శెట్టి తల్లి యావర్ ని పట్టుకుని ‘నిన్న ఎందుకు ఏడ్చవ్ .. మా అమ్మ కదా .. అమ్మా లేదనా ఇదిగో మీ అమ్మా ఎప్పుడు నీతోనే ఉంటుంది అంటూ యావర్ తల్లి ఫోటో ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక సీన్ చూస్తే ఆడియన్స్ కళ్ళు చెమ్మగిల్లాల్సిందే.
కాగా యావర్ అన్న అహ్మద్ నేడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముందు కాసేపు మెయిన్ డోర్స్ ఓపెన్ చేస్తూ .. క్లోజ్ చేస్తూ కంటెస్టెంట్స్ తో ఆడుకున్నారు బిగ్ బాస్. తర్వాత యావు .. మేరా .. బచ్చా అంటూ హౌస్ లోకి వచ్చిన అన్నను పట్టుకుని తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు యావర్. తర్వాత గౌతమ్ తో మాట్లాడుతూ ‘ మాకు చిన్నపట్నుంచి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు అందుకే వాడు మీ అమ్మని చూసి అంత ఎమోషనల్ అయ్యాడు అని చెప్పాడు యావర్ అన్న.
తర్వాత యావర్ తో ‘నువ్వు స్ట్రాంగ్ రా .. స్ట్రాంగ్ గా ఆడు.. కప్ గెలవాలి అంటూ ధైర్యం నింపాడు. మాకు తల్లి ప్రేమ తెలియదంటూ శివాజితో చెప్తూ సుజా అహ్మద్ కన్నీరు పెట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ సమయం అయిపోయింది అని చెప్పడంతో అందరికి బై బై చెప్పి ‘సుజా అహ్మద్ బ్రదర్ ఆఫ్ యావర్ అహ్మద్’ అంటూ గర్వంగా చెప్పాడు.
వీళ్ళని చూస్తే అన్నదమ్ములు అంటే ఇలా కదా ఉండాలి అనిపిస్తుంది. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన యావర్ కి అన్నీ తానై పెంచాడు సుజా అహ్మద్. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి యావర్ అన్నని తలుచుకుని చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ రోజు అన్నదమ్ములు ఇద్దరు అందరిని ఏడిపించేసారు. ఈ అన్నదమ్ముల బంధం హార్ట్ టచింగ్ గా ఉంది.
అలాగే అమర్ దీప్ భార్య తేజస్విని సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ అమర్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తేజస్విని రావడం లేదు, అందుకు బదులుగా కేక్ పంచిందని అబద్దం చెప్పాడు. నిజమే అని నమ్మిన అమర్ బాధపడ్డాడు. కేకు తీసుకుని బయటకు వచ్చాడు. హౌస్లో అప్పటికే తేజస్విని ఉంది. ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు. నిన్ను చాలా మిస్ అయ్యాను. ఒంటరిగా ఏడ్చాను అని అమర్ అన్నాడు. అమర్ చిన్నపిల్లాడు అని తేజస్విని హౌస్ మేట్స్ తో చెప్పింది.
శోభ శెట్టి తల్లి రావడంతో ఆమె ఎగిరి గంతులు వేసింది. అనూహ్యంగా యావర్ కోసం ఆమె బహుమతి తెచ్చింది. యావర్ తల్లి ఫోటో తేవడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. శోభ తల్లి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. మొత్తంగా గురువారం ఎపిసోడ్ కూడా ఎమోషనల్ గా ముగిసింది.