Devil Review: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు టాలెంట్ ఉండి కూడా వాలు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడం వల్ల స్టార్ హీరోలుగా ఎదగలేక పోతున్నారు అలాంటి వాళ్ళలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఆయనకి స్టార్ హీరో అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా స్క్రిప్ట్ సెలక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల తను ఒక మీడియం రేంజ్ హీరోగా మిగిలిపోయాడు. కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేసి సక్సెస్ లు సాధించడంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.ఇక దానికి తగ్గట్టుగానే 2022వ సంవత్సరంలో బింబిసార అనే సినిమాతో వశిష్ఠ అనే డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక దాని తర్వాత ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే ఈ సినిమా ఎలా ఉంది సినిమా సక్సెస్ అయిందా లేదా అనే విషయాలను మనం బ్రీఫ్ అనాలసిస్ లో తెలుసుకుందాం…
ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బ్రిటిష్ కాలంలో ఒక రాజు కుటుంబంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఎవరు చేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కళ్యాణ్ రామ్ ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆయన ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో కళ్ళు చెదిరే నిజాలు ఆయనకు తెలుస్తూ ఉంటాయి…ఇక అందులో భాగంగానే ఆ మర్డర్ కి బ్రిటిష్ సీక్రెట్ మిషిన్ కి మధ్య సంబంధం ఉందని తెలుసుకున్న అధికారులు కళ్యాణ్ రామ్ తో ఆపరేషన్ టైగర్ హంట్ మొదలు పెడతారు.దాంతో ఆ హత్యకి బ్రిటిషర్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి కళ్యాణ్ రామ్ ప్రాణాలకు తెగించి ఈ మిషిన్ ని చేయడానికి గల కారణం ఏంటి..? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా అభిషేక్ నామ వ్యవహరించారు. ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అభిషేక్ నామ ఈ సినిమాని తనదైన రీతిలో తెరకెక్కించడమే కాకుండా సినిమాకు కావాల్సిన అడిషనల్ ఇన్ పుట్స్ ని కూడా ఈ సినిమాకి అందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నార్మల్ గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం కళ్యాణ్ రామ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి అందరూ ఫిదా అయిపోతారు. నిజానికి ఆయన కంప్లీట్ గా ఆ పాత్రకి సరెండర్ అయిపోయి ఆయన నటిచినట్టు గా మనకు తెలుస్తుంది… ఇక సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి అలాగే సినిమాకి మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి చాలా హైలైట్ గా నిలుస్తుంది. అలాగే ఈ సినిమాని విజువల్ గా సినిమాటో గ్రాఫర్ చాలా అద్భుతంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో కామెడీ కొంతవరకు ప్లస్ అయింది.కానీ అక్కడక్కడ డైరెక్షన్ పరంగా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని సీన్లు మరి లాగ్ అయిపోయాయి కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం బోరింగ్ గా కూడా అనిపిస్తూ ఉంటాయి… మొత్తానికి ఈ సినిమా కళ్యాణ్ రామ్ లో ఉన్న పొటెన్షియాలిటీని మరొకసారి బయటికి తీసింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా బింబిసార తర్వాత ఆయనకి మంచి సక్సెస్ ని ఇచ్చిందనే చెప్పాలి…
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ మరొకసారి మరొక మంచి పాత్రను పోషించడమే కాకుండా అందులో లీనమై అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ఇక సంయుక్త మీనన్ తనదైన రీతిలో నటించడమే కాకుండా ఈ సినిమాలో తన వంతు ప్రయత్నం చేసి సినిమా సక్సెస్ లో తను కూడా భాగమైంది.ఇక దీంతో వరుసగా సంయుక్త మీనన్ కి ఐదవ సక్సెస్ దక్కిందనే చెప్పాలి… అలాగే మిగతా ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ లు కూడా చాలా బాగున్నాయి.ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా తమ పరిధిని మించకుండా సెటిల్ గా నటించి మెప్పించారు…
ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే సౌందర్య రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా ఆ విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయి అని చూసేవాళ్ళు అనుకునేలా నీట్ గా క్లీన్ గా క్లియర్ గా ప్లాన్ చేసుకొని మరి ఈ సినిమా మీద పూర్తిగా ఎఫర్ట్ పెట్టీ మంచి అవుట్ పుట్ అందించాడు. బ్రిటిష్ కాలం నాటి రోజులను రి క్రియేట్ చేయడంలో విజువల్ గా ఆయన పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది.అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్ ని ఎలివేట్ చేయడంలో చాలావరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి… ఎడిటర్ తమ్మి రాజు అందించిన ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు హైలెట్ అయింది అనే చెప్పాలి. ఏ సీను ఎక్కడ వరకు ఉండాలి. ఏ సీన్ ఎంత లెంత్ లో కట్ చేయాలి అనేది కరెక్ట్ గా మీటర్ మీద కట్ చేసినట్టుగా సినిమా లో కీలకమైన సీన్లలో బోర్ అనేది లేకుండా నీట్ గా సాగేలా చేశాడు…
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ యాక్టింగ్
సౌందర్య రాజన్ విజువల్స్
కథ,స్క్రీన్ ప్లే
యాక్షన్ సీన్స్
సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే
డైరెక్షన్ కొంచెం మైనస్ అయింది.
కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నాయి
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5