Fighter Review: బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ ఫైటర్’. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ (జనవరి 25) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఏంటి? పబ్లిక్ టాక్ మరియు క్రిటిక్స్ ఏం అంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వార్, పఠాన్ చిత్రాల తరువాత డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీసిన మూవీ ‘ఫైటర్’. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే ఏరియల్ యాక్షన్ చిత్రంగా నిర్మితమైంది. ఏరియల్ కాంబాట్, ఎమోషన్స్, దేశ భక్తి మరియు డ్రామా అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. దేశం కోసం నిస్వార్థంగా సేవలు అందించడమే కాకుండా దేశ రక్షణ కోసం పాటుపడుతున్న వీరులందరికీ ‘ఫైటర్ ’ ఘన నివాళి అర్పిస్తుందని చెప్పుకోవచ్చు.
పఠాన్, జవాన్ సినిమాలు విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోగా.. ఫైటర్ విషయంలో మాత్రం బుకింగ్స్ తేలిపోయాయి. సినిమా మీద ఎవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ప్రస్తుతం మాత్రం ఫైటర్ జోరు కొనసాగుతోంది. ఫైటర్ చిత్రానికి ఓవర్సీస్ నుంచి మంచి టాక్ వస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని కొందరు చెబుతుండగా సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. అంతేకాదు క్రిటిక్స్ సైతం సినిమాను పొగిడేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే అందరూ నాలుగు, నాలుగున్నర రేటింగ్స్ ఇస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా ఫైటర్ చిత్రం చాలా బాగుందని తెలిపారు. సినిమాను మిస్ చేసుకోవద్దని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఫైటర్ మూవీకి 4.5 రేటింగ్ ఇచ్చిన ఆయన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టారని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని తెలిపారు.
ఫైటర్ సినిమాలో హీరో హృతిక్ రోషన్ నటన హైలెట్ కాగా దీపికా పదుకోన్ నటన మరో ప్లస్ పాయింట్. వీరి మధ్య కెమిస్ట్రీ సూపర్ అంటూ క్రిటిక్స్ చెబుతున్నారు. అలాగే అనిల్ కపూర్ నటన అద్భుతంగా ఉందని తెలిపారు. మొత్తం మీద హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయమని నెటిజన్లు తెలుపుతున్నారు.