Homeఎంటర్టైన్మెంట్మూవీ రివ్యూHit 3 Movie Review: హిట్ 3' ఫుల్ మూవీ రివ్యూ...

Hit 3 Movie Review: హిట్ 3′ ఫుల్ మూవీ రివ్యూ…

Hit 3 Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాని (Nani)…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన శైలేష్ కొలన్ (Shailesh Kolen) డైరెక్షన్ లో చేసిన హిట్ 3 (Hit 3) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Also Read: అల్లు అర్జున్ పుష్ప 2 కి ఘోర అవమానం జరగడానికి కారణం ఏంటి..?

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ‘అర్జున్ సర్కార్’ అనే ఒక రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ కి మర్డర్ మిస్టరీ కేసు అయితే వస్తుంది. ఇక దానిని సాల్వ్ చేయడానికి ఆయన ఎలాంటి డిసీజన్స్ తీసుకున్నాడు. మొత్తానికైతే ఆయన ఆ కేసు ను సాల్వ్ చేశాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే యాక్టర్ శైలేష్ కొలన్ తీసిన హిట్ సినిమా సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ప్రతి విషయంలో విచ్చల విడిగా బూతులు మాట్లాడుతూ తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ఒక క్యారెక్టర్ లో నటించాడు. అయితే దర్శకుడు ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది.

ఇక ఆ కేసును సాల్వ్ చేయడంలో నాని ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాడు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించారు. మొదటినుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజింగ్ గా నడిపించడంలో శైలేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ తను రాసుకున్న స్క్రీన్ ప్లే లో ఎక్కడా కూడా డౌటు రాకుండా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఇక మొత్తానికైతే శైలేష్ ప్లాపుల్లో ఉన్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో నాని పిలిచి అవకాశం ఇచ్చినప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

కాబట్టి దానికి ఏమాత్రం తగ్గకుండా ఆయన రైటింగ్ లోని మెచ్యూరిటీని ఈ సినిమాలో చాలా బాగా చూపిస్తూ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాడు. ఇక ఎమోషనల్ సీన్స్ ని డీల్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో నాని వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు. అలాగే విలన్ ఎవరు అనే ట్విస్ట్ రివిల్ చేసినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఎగ్జైట్ అవ్వకపోవచ్చు.

ఎందుకంటే ఆ మర్డర్ చేసిన వ్యక్తులు ఎవరో మనకు తెలియదు. అంటే అనోన్ పేస్ ని పెట్టడం వల్ల ఆ ట్విస్ట్ అనేది పెద్దగా ఎలివేట్ అయితే అవ్వలేదు… ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా మిక్కీ జే మేయర్ కొంతవరకు తడబడ్డాడు. ఆయన అనుకున్న రేంజ్ లో అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు.దానివల్లే కొన్ని సీన్స్ లో ఇంపాక్ట్ అయితే తగ్గింది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాని ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్లాడు. అర్జున్ సర్కార్ అనే ఒక క్యారెక్టర్ లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక వ్యక్తిగా తను చాలా బాగా నటించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు వైజాగ్ లో ఇలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ నిజంగానే ఉన్నాడా? అనే ఒక ఫీల్ చూసి ఆడియన్స్ కి అయితే కలుగుతుంది. అంటే అందులో ఆయన ఎంత బాగా నటించి మెప్పించాడో మనం అర్థం చేసుకోవచ్చు. నాని లాంటి హీరోకి ఒక పవర్ఫుల్ రోల్ దొరికితే ఎలా నటిస్తారో చెప్పడానికి ఈ సినిమాను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…

సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇప్పటివరకు ఆయన కెరియర్లో ఉన్నటువంటి ది బెస్ట్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడనే చెప్పాలి… ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. మిగతా ఆర్టిస్టులందరు ఈ సినిమా సక్సెస్ కి సపోర్ట్ చేస్తూ అలాగే వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటిస్తు మెప్పించే ప్రయత్నం అయితే చేశారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ కొంతవరకు బాగున్నప్పటికి బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఆయన చాలావరకు డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ని ఇవ్వాలి అనేది ఆయన మరచిపోయినట్టున్నాడు. అందువల్లే చాలా ఫ్లాట్ మ్యూజిక్ ని అందించాడు. అంతే తప్ప క్యూరియాసిటీని పెంచే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోయాడు…

ఇక సినిమాటోగ్రాఫర్ కూడా ఈ సినిమాకి అందించిన ప్రతి షాట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో వచ్చిన డిఫరెంట్ షాట్స్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడమే కాకుండా సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అవి ప్రేక్షకుడిని వెంటాడుతుంటాయి…

ప్లస్ పాయింట్స్

నాని
సెకండాఫ్
డైరెక్షన్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

బ్యాగ్రౌండ్ మ్యూజిక్
అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి…

రేటింగ్

ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5

 

HIT 3 Telugu Trailer | Nani | Sailesh Kolanu | Srinidhi Shetty | In Cinemas May 1st

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version