Gam Gam Ganesha Movie Review: విజయ్ దేవరకొండ తమ్ముడి గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ చాలా సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన గత సంవత్సరం చేసిన బేబీ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇంకా అందులో భాగంగానే ఉదయ్ బొమ్మశెట్టి దర్శకత్వంలో “గం గం గణేశా” అనే సినిమాను చేశాడు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంది. ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా తర్వాత మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాడా లేదా అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే గణేష్ అనే ఒక కుర్రాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. కెరియర్ లో తన స్నేహితురాలు తనకు చేసిన అన్యాయం వల్ల తను బిలియనీర్ అవ్వాలని కోరుకుంటాడు. ఇక అందులో భాగంగానే హైదరాబాద్ లో ఉన్న ఖరీదైన అరుదైన వజ్రాలను దొంగతనం చేయడమే టార్గెట్ గా పెట్టుకొని అదే పని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక ఇదే క్రమంలో రాయలసీమలో విభిన్నమైన వినాయక విగ్రహాలతో రాజకీయ నాయకుడు జూదం చేస్తాడు. ఇక ఈ విగ్రహంలో వజ్రాలు చేరిపోతాయి. అయితే ఆ వజ్రాలను మళ్ళీ గణేష్ ఎలా దక్కించుకున్నాడు, వజ్రంతో తను ఏం చేశాడో అనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ ఉదయ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుడిని ఏరకంగాను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. ఇక కథ పరంగా చూసుకున్న ఇందులో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. కథ ఒక గమ్యం లేకుండా దారి తెగిన గాలిపటం లాగ ముందుకు కదిలింది. అయితే అది ఎక్కడ ఏ కొమ్మకు చిక్కి ఆగుతుందో కూడా ఎవరికి తెలియదు. అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ని సృష్టించి దాని చుట్టూ ట్రీట్మెంట్ ని కూడా అంతా పకడ్బందీగా అల్లుకోకపోవడం అనేది డైరెక్టర్ యొక్క మెయిన్ మైనస్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈమధ్య క్రైమ్ కామెడీ జానర్ కి సంబంధించిన సినిమాలు ఏవి కూడా థియేటర్ లో పెద్దగా సందడి చేయలేకపోతున్నాయి. కాబట్టి ఇలాంటి క్రమంలో ఆయన ఒక క్రైమ్ కామెడీతో వచ్చి మంచి సక్సెస్ సాధిస్తాడు అని అనుకున్న అభిమానులందరికీ నిరాశే మిగిలింది.
సినిమాలో ప్లాట్ పాయింట్ రివిల్ అయిన తర్వాత ఒక్క హై మూమెంట్ కూడా రాకపోవడం నిజంగా బాధకరమైన విషయం అనే చెప్పాలి. హై మూమెంట్ వస్తుందని ప్రతి ఒక్క అభిమాని కండ్లు కాయలు కాచేలా వేచి చూడడమే తప్ప ఒక్కసారి కూడా ఈ సినిమా మొత్తం లో ఒక్కటి కూడా హై ఎమోషనల్ సీన్ లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. అందుకే ఒక సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే దానికి సంబంధించిన స్టొరీని పకడ్బందీగా రాసుకొని ఆ కథ ఎలా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్ ని మెప్పించగలుగుతుందా లేదా అనే ఒక పూర్తి స్పృహతో కథ రాసుకుంటే బాగుండేది. అయితే కథలో చేసిన ఫాల్ట్ వల్లే ఈ సినిమా అనేది ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది. ఇక మొత్తానికైతే ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో ఒక భారీ దెబ్బ తిన్నాడనే చెప్పాలి. బేబీ లాంటి ఒక కల్ట్ క్లాసికల్ మూవీ తర్వాత ఆయన చేయాల్సిన సినిమా ఇది అయితే కాదు. ఇక భారీ రేంజ్ లో రెండు మూడు సక్సెస్ లు సాధిస్తే తప్ప విజయ్ దేవరకొండ రేంజ్ కి ఆనంద్ దేవరకొండ వెళ్ళలేడు అనేది వాస్తవం…
ఇమాన్యుల్ తో కామెడీ చేయించాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పిన ఏ డైలాగు కూడా థియేటర్లో ప్రేక్షకుడికి నవ్వు తెప్పించదు. ఇక ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది. కానీ అక్కడక్కడ మాత్రమే ఆయన కామెడీ పేలిందనే చెప్పాలి. ఇక వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది.కానీ ఆయనను పూర్తి లెవెల్లో వాడుకోవడంలో దర్శక నిర్మాతలు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి…ఇక ఈ సినిమాలో ఒకటి రెండు సీన్లను మినహాయిస్తే సినిమా మొత్తం చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. మరి ఆనంద్ దేవరకొండ కూడా ఏ ధైర్యంతో ఈ సినిమాని చేశాడు అనేది తెలియాల్సి ఉంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్…
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ తన గత చిత్రాల మాదిరిగానే ఓకే అనిపించారు. నయన్ సారిక, ప్రగతి శ్రీవత్సవన్ అనే ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్ళు సినిమాకి ఏ రకంగానూ హెల్ప్ అయితే అవ్వలేదు.వాళ్ల క్యారెక్టర్ డిజైన్ చేయడం లోనే చాలా పెద్ద ఫ్లాస్ అయితే ఉన్నాయి. అందువల్లే ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చలేదు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఉన్న నటీనటులందరూ సినిమానే గట్టెక్కించాలని తీవ్రమైన ప్రయత్నమైతే చేశారు. కానీ కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడమే ఈ సినిమాని చాలా వరకు మైనస్ గా మారింది…
టెక్నికల్ అంశాలు…
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ముఖ్యంగా కొన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సాంగ్స్ అయితే రొటీన్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమా విజువల్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా రిచ్ గా కనిపించాయి. ఇక ఆదిత్య జవ్వడి అందించిన విజువల్స్ ఈ సినిమాని చాలా రిచ్ గా ప్రజెంట్ చేశాయి.ఇక దర్శకుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా కథలో పెద్దగా దమ్ము లేకపోవడం వల్ల ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్
ఆనంద్ దేవరకొండ యాక్టింగ్…
సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు…
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
స్లో నరేషన్
రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5
చివరి లైన్
గం గం గణేశా సినిమా భారీ అంచనాలను పెట్టుకొని వెళ్తే మాత్రం భారీగా డిజప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అంచనాలు లేకుండా వెళితే ఒకసారి ఎంజాయ్ చేయవచ్చు…