Sreemukhi: బుల్లితెర టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. కెరీర్ బిగినింగ్ లో నటిగా ప్రయత్నాలు చేసిన శ్రీముఖి యాంకర్ గా మారింది. కొన్నేళ్లుగా బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది. శ్రీముఖి అందానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చూపు తిప్పుకోలేని గ్లామర్ తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తుంది. ఒకవైపు షోలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
పటాస్ షోతో వెలుగులోకి వచ్చింది శ్రీముఖి. తన ఎనర్జీ, చలాకి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు షోల్లో యాంకర్ గా చేసి ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసింది. మగవాళ్ళతో సమానంగా టాస్కుల్లో సత్తా చాటింది. విన్నర్ రేసులో నిలిచింది. కొద్దిలో టైటిల్ శ్రీముఖి చేజారింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కాగా శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. రాహుల్ కి సింపథీ వర్క్ అవుట్ అయ్యింది.
టైటిల్ కోల్పోయినా బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి కెరీర్ టర్న్ అయింది. మంచి ఆఫర్స్ అందుకుంది. సినిమాల్లో సైతం కీలక పాత్రల్లో నటించే అవకాశం ఆమెకు దక్కింది. పలు చిత్రాల్లో శ్రీముఖి నటించినప్పటికీ ఆమెకు బ్రేక్ రాలేదు. అందుకే ఎక్కువగా యాంకరింగ్ పైనే ఫోకస్ చేస్తుంది. బుల్లితెరకు పరిమితమైంది. అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తుంది. ప్రస్తుతం శ్రీముఖి పలు షోలు చేస్తూ బిజీగా మారిపోయింది.
స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ 2.0, స్టార్ మా పరివారం వంటి షోలు చేస్తుంది. ఇక లేటెస్ట్ గా శ్రీముఖి ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చింది. చోళీ లెహంగా ధరించిన శ్రీముఖి నడుము అందాలు నరాలు జివ్వుమనిపిస్తున్నాయి. పైట లేకుండా కెమెరా ముందు క్రేజీ ఫోజులతో రచ్చ చేసింది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తరచుగా శ్రీముఖి పెళ్లి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.