Homeప్రత్యేకం12th Fail Review: 12th ఫెయిల్ మూవీ ఫుల్ రివ్యూ...

12th Fail Review: 12th ఫెయిల్ మూవీ ఫుల్ రివ్యూ…

12th Fail Review: ఓటమి అది ఎంత భయంకరమైనది అంటే గెలుపు వెంట పరిగెడుతున్న ప్రతి ఒక్కడి గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది. గెలవడం మన వల్ల కాదేమో అని మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకునేలా చేస్తుంది. మన చేత కన్నీళ్లు పెట్టిస్తుంది, మన అనుకున్న వాళ్ళను దూరం చేస్తుంది. ఒక ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు ఇంకోసారి ప్రయత్నించడానికి భయపడిపోతాడు.కానీ ఆ ఓటమిని జయించలేకపోతే మనం బ్రతికున్న శవంలా మిగిలిపోవాల్సిందే… ఓటమి పెద్ద గొప్పది ఏం కాదు కానీ మనకు సమస్యలను సృష్టించి మనల్ని దానికి దాసోహం చేసుకొని మనమీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది.

విజయం సాధించాలనే కాంక్ష నీ గుండెల్లో పాతుకుపోతే నీకు ఎదురయ్యే ప్రతి ఓటమిని చీల్చి చెండాడోచ్చు… ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు సైతం 12 గంటలు మాత్రమే భూమ్మీద ఉంటాడు. అలాంటిది మనకు వచ్చే కష్టం మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుందా ఉండదు కదా! ఆ ఒక్క చిన్న పాయింట్ ని మనం అర్థం చేసుకున్నట్టయితే విజయం సులభం అవుతుంది, ఓటమిని తట్టుకోలేక చనిపోయే వారి చావులు ఆగుతాయి. గెలుపు మనకు ఏం ఇస్తుందంటే అప్పటిదాకా నిన్ను వేలు ఎత్తి చూపించినవాడు కూడా ప్రపంచానికి నీ గురించి ఎలుగెత్తి చెప్తాడు. అలాంటి విజయాన్ని సాధించినప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకు సాగితే ఈ ప్రపంచంలో నిన్ను ఓడించే శక్తి ఏదీ లేదు అనేది వాస్తవం… ఓటమి రూపాలు మార్చుకొని పోరాటం చేసిన కూడా ధైర్యం అనేది ఒకటి నీ గుండెల్లో ఉన్నంత కాలం ఏ ఓటమి కూడా నీ చిటికెన వేలు గోరు ను కూడా తాకలేదు.

ఇక ఇదే పాయింట్ తో 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది.ఒక లక్ష్యం తో ముందుకు దూసుకెళ్లేవాడు తప్పనిసరిగా ఈ సినిమాని చూస్తే తనని తాను మోటివేట్ చేసుకొని తన లక్ష్యానికి వెళ్లే మార్గాన్ని సులభం చేసుకుంటాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక గత కొద్ది రోజులుగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు ఈ సినిమాలో ఏముంది అంతలా ఏం చూపించారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ సినిమాలో ఏం చెప్పారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ
ముందుగా ఈ సినిమా కథలోకి వెళ్తే
ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ నిజాయితీగా బతుకుతున్న ఒక వ్యక్తి కొడుకే మనోజ్ కుమార్. ఈ ప్రభుత్వ ఉద్యోగి (మనోజ్ కుమార్ నాన్న) నేను జీవితంలో లంచం తీసుకోను అని చెప్పిన ఒకే ఒక మాటకి తన పై అధికారి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యేలా చేస్తాడు. కానీ ఆయన తన సస్పెండ్ ని ఒప్పుకోక న్యాయ పోరాటం చేస్తూ ఉంటాడు. ఇక ఇదే టైం లో మనోజ్ కుమార్ మాత్రం 12వ తరగతి పాస్ అవ్వడానికి చిట్టీలు పెట్టి ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్తాడు, కానీ అక్కడ ఇన్విజిలేటర్ గా ఉన్నవాళ్లే బోర్డు మీద ఆన్సర్లు రాసి స్టూడెంట్స్ ని రాసుకోమని చెప్తుంటారు. ఇంతలో డిఎస్పి ద్యుష్యంత్ ఎగ్జాం సెంటర్ కి వచ్చి ఆ ప్రిన్సిపాల్ ని అరెస్ట్ చేస్తాడు. ఈ కాలేజ్ ఒక పొలిటికల్ పర్సన్ కి సంబంధించిన వ్యక్తి ది అని తెలిసిన కూడా ఎక్కడ తగ్గకుండా తన నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాడు దుష్యంత్..అలాగే ఆ కాలేజీ యాజమాన్యం మీద కేస్ నమోదు చేస్తాడు…

ఇక మొత్తానికి ఆ సంవత్సరం మనోజ్ కుమార్ 12 వ తరగతిలో ఫెయిల్ అవుతాడు. ఒక రోజు డిఎస్పీ దుష్యంత్ ని కలిసిన మనోజ్ మీలాగా నేను కూడా ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతాడు. దానికి ఆయన సమాధానం గా ‘ముందు నువ్వు నిజాయితీగా ఉండడం నేర్చుకో ‘ అంటూ ఒక మాట చెప్తాడు. అదే మాట తన గుండెల్లో బలంగా నాటుకు పోతుంది. ఇక అప్పటి నుంచి ఆయన ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు.ఐపిఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి అని తెలుసుకొని దానికోసం ఒక దృఢ సంకల్పంతో తన లక్ష్యాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడు. 24 గంటల సమయాన్ని ఎలా వాడుకోవాలి అనేది ఆయన కరెక్ట్ గా ఫాలో అవుతూ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి.ఆ టైమ్ లో ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వస్తుంటాయి.

అంతటి ఎదురు దెబ్బలు తిన్నా కూడా ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గడు. పట్టువదలని విక్రమార్కుడిగా తన లక్ష్యం కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. పొద్దంతా లైబ్రరీలో వర్క్ చేసుకుంటూ టాయిలెట్లు కడుక్కుంటూ, కేవలం 3 గంటలు మాత్రమే పడుకొని, ఆరు గంటలు చదువుకుంటూ ఉంటాడు. ఇలాంటి ఒక కుర్రాడు చేసిన పోరాటమే ఈ సినిమా…ఇది చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ధృడ సంకల్పాన్ని పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. చివర్లో తను ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వచ్చే సీన్లు మాత్రం గుజ్ బామ్స్ తెప్పిస్తాయనే చెప్పాలి. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుంచి తప్పకుండా నీళ్లు కారుతూ ఉంటాయి. అంతటి గొప్ప మ్యాజిక్ ని డైరెక్టర్ విదు వినోద్ చోప్రా ఈ సినిమాలో చేసి చూపించాడు. నిజానికి ఇది ఒక రియల్ స్టోరీ అయినప్పటికీ దానికి కమర్షియల్ అంశాలను జోడించి చాలా అద్భుతంగా తెరకెక్కించి చాలా గొప్ప గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అందులో వంద కి వంద శాతం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.ఇక మనోజ్ కుమార్ పాత్రని పోషించిన విక్రాంత్ ఆ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి. ఇక శ్రద్ద పాత్రలో నటించిన మెదా శంకర్ కూడా ఒదిగిపోయి నటించింది. ఇక మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చోట్ల మనకు గూజ్ బమ్స్ తెప్పిస్తుంది…

ఇక ఇలాంటి సినిమా గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.అందుకే ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తే తప్ప వాళ్ళు ఒక గొప్ప అనుభూతిని పొందలేరు. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాని చూడని ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది తప్పకుండా చూడండి. మీరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం పోరాటం చేస్తారు, అంతలా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ ‘భూమ్మీద ఏ ఓటమికి లొంగని శక్తి ఏదైనా ఉంది అంటే అది మనిషి ఒక్కడే’ అనేది తెలుసుకుంటే చాలు. ‘పోరాడితే పోయేదేమీ లేదు ఏడవ బానిస సంకెళ్లు తప్ప అనే ఒక్క మాట ని మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగండి గెలుపు దానంతట అదే మిమ్మల్ని వరిస్తుంది…

ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ని పక్కన పెడితే ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version